Home Political News కొలిక్కి వ‌చ్చిన మ‌హా కూట‌మి సీట్ల స‌ర్ధుబాటు..!

కొలిక్కి వ‌చ్చిన మ‌హా కూట‌మి సీట్ల స‌ర్ధుబాటు..!

80
0

టీఆర్ఎస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఏర్ప‌డిన మ‌హా కూట‌మి సీట్ల స‌ర్ధుబాటు విష‌య‌మై గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ‌లు జ‌రుపుతూనే ఉంది కానీ..క్లారిటీ రాలేదు. అతి త్వ‌ర‌లోనే ఈ కూట‌మి అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌నుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. తాజా స‌మాచారం ఏంటంటే…సీట్ల స‌ర్దుబాటు ఓ కొలిక్కి వ‌చ్చింది. అర్ధరాత్రి వ‌ర‌కు జ‌రిగిన చ‌ర్చ‌లు స‌ఫ‌లం అయ్యాయి. టీడీపీ – 13, జ‌న స‌మితి – 8, సీపీఐ – 4  స్ధానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది.

ఉమ్మ‌డిగా అభ్య‌ర్ధుల తొలి జాబితాను ప్ర‌క‌టిద్దామ‌ని కాంగ్రెస్ ప్ర‌తిపాద‌న చేయ‌గా…టీడీపీ, జ‌న స‌మితి, సీపీఐ సానుకూలంగా స్పందించారు. మాకు సీట్లు కాదు టీఆర్ఎస్ ఓట‌మే ముఖ్యం అని కూట‌మి నాయ‌కులు స్ప‌ష్టం చేసారు. ఇప్ప‌టికే పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ నేత‌లు జానారెడ్డి,  ష‌బ్బీర్ ఆలీ, భ‌ట్టి విక్ర‌మార్క కూడా ఢిల్లీకి వెళ్లారు. ఇదిలా ఉంటే…కోదండ‌రామ్ కోరిన‌న్ని సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీక‌రించ‌డం లేదు. అందుచేత కోదండ‌రామ్ కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తార‌ని..న‌వంబ‌ర్ 1న ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని వ‌చ్చిన వార్త‌ల‌న్నీ అవాస్త‌వాలే అని దీనిని బ‌ట్టి అర్ధం అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here