Home Actor కోటి డిజిటల్ వ్యూస్ తో మ‌జిలీ…లేటెస్ట్ అప్ డేట్ ఏంటి..?

కోటి డిజిటల్ వ్యూస్ తో మ‌జిలీ…లేటెస్ట్ అప్ డేట్ ఏంటి..?

73
0


అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత జంట‌గా న‌టించిన తాజా చిత్రం మ‌జిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మ‌జిలీ చిత్రం టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. యూ ట్యూబ్ లో ప‌ది మిలియ‌న్ల వ్యూస్ అన‌గా కోటి డిజిట‌ల్ వ్యూస్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. గోపీ సుంద‌ర్ అందించిన విన‌సొంపైన బాణీలు అందించ‌డంతో ఇటీవ‌ల రిలీజ్ చేసిన సాంగ్స్ కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది.

వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ ఎమోష‌న‌ల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ కి బిగినింగ్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డ‌బ్బింగ్ వ‌ర్క్ పూర్తి చేసుకుంది. ఈ నెలాఖ‌రున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్ధాయిలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీ పోస్ట‌ర్స్  చూస్తుంటే…చైత‌న్య‌, స‌మంత చాలా అందంగా క‌నిపిస్తూ… వ‌య‌సులో ఓ ప‌దేళ్లు వెన‌క్కి వెళ్లిన‌ట్టుగా క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్స్ ఈ సినిమా పై మ‌రిన్ని అంచ‌నాల‌ను పెంచేసింది అని చెప్ప‌చ్చు. ఏప్రిల్ 5న మ‌జిలీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి..అంచ‌నాల‌ను అందుకుని ఏ స్ధాయి విజ‌యాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here