Home Actor కోదండరామిరెడ్డి జన్మదిన వేడుకలు – చాలా కాలం త‌ర్వాత క‌లిసిన చిరు, బాల‌య్య‌, వెంకీ.

కోదండరామిరెడ్డి జన్మదిన వేడుకలు – చాలా కాలం త‌ర్వాత క‌లిసిన చిరు, బాల‌య్య‌, వెంకీ.

53
0
కోదండరామిరెడ్డి జన్మదిన వేడుకలు - చాలా కాలం త‌ర్వాత క‌లిసిన చిరు, బాల‌య్య‌, వెంకీ. spiceandhra

ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి 70వ జన్మదిన వేడుకలు సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్‌…ఈ ముగ్గురు హాజ‌రు కావ‌డం విశేషం. ఈ ముగ్గురు ఓకే చోట కనిపించడం చాలా అరుదు.  టాలీవుడ్ నటీనటుల క్రికెట్ పోటీల్లో కనిపించిన తరువాత, వీరు ముగ్గురూ కలిసి ఒకేచోట మరోసారి కనిపించలేదు. కానీ, నిన్న రాత్రి వీరు ముగ్గురూ కలిసారు. కోదండరామిరెడ్డికి కేక్ తినిపించి, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుక‌లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎమ్మెస్ రాజు, అశ్వనీదత్, దిల్‌ రాజు,  అనిల్ సుంకర, దర్శకులు బి. గోపాల్, పరుచూరి వెంకటేశ్వరరావు, సత్యానంద్, డాక్టర్ కె.ఎల్. నారాయణ, చంటి అడ్డాల, ఎస్ గోపాల్‌రెడ్డి, సంగీత దర్శకుడు కోటి, కెమెరామెన్ రవీంద్రబాబు, శ్రీమిత్ర చౌదరి, శ్రీనివాస్ రాజు, కోదండరామిరెడ్డి కుమారులు సునీల్, వైభవ్ ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కోదండరామిరెడ్డి జన్మదిన వేడుకలు - చాలా కాలం త‌ర్వాత క‌లిసిన చిరు, బాల‌య్య‌, వెంకీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here