Home Actor కౌసల్య కృష్ణమూర్తి టీజర్ ని ఆవిష్కరించనున్న మెగాస్టార్ చిరంజీవి.

కౌసల్య కృష్ణమూర్తి టీజర్ ని ఆవిష్కరించనున్న మెగాస్టార్ చిరంజీవి.

63
0

ఇటీవల క్రికెట్ నేపథ్యంలో నాగ చైతన్య హీరోగా వచ్చిన మజిలీ, అలానే నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన జెర్సీ సినిమాలు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం క్రికెట్ కథాంశంతో మరొక కొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ చిత్రమే కౌసల్య కృష్ణమూర్తి, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్‌ మెయిన్ లీడ్ గా నటిస్తోంది.

 తమిళ నటుడు శివకార్తికేయన్ ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ‘కనా’ అనే తమిళ చిత్రానికి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతోంది. కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లోనటిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై  క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తుండగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు.

మహిళా క్రికెటర్‌ కథాంశంతో వస్తున్న విభిన్న చిత్రం ఇదని అలానే, ఒక మంచి సబ్జెక్ట్‌తో, ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌తో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని చిత్ర బృందం అంటోంది. అయితే క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో రైతుల సమస్యలను కూడా ప్రస్తావించినట్లు సమాచారం. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ నేడు సాయంత్రం 5 గం లకు మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదల కానుంది. వచ్చేనెలలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తోంది చిత్ర యూనిట్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here