Home Movie News క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, క్రాంతిమాధ‌వ్ చిత్రం..!

క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, క్రాంతిమాధ‌వ్ చిత్రం..!

90
0

తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌తిష్మాత్మ‌క నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ సంస్థ‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.46 గా విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా రూపొందుతోంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ లో ఈయ‌న చేస్తోన్న తొలి సినిమా ఇది. అక్టోబ‌ర్ 18న హైద‌రాబాద్ లో ఈ చిత్ర ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది.

అదే రోజు ఈ చిత్రంలో న‌టించ‌బోయే న‌టీన‌టులు చిత్రానికి ప‌ని చేయ‌నున్న సాంకేతిక నిపుణుల గురించి పూర్తి వివ‌రాలు చిత్ర యూనిట్ తెలియ‌జేయ‌నుంది. ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొంద‌నున్న ఈ చిత్రంలో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్, ఇసాబెల్లె డి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. జేకే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత కేఎస్ రామారావు స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రాన్ని కేఎ వ‌ల్ల‌భ నిర్మిస్తున్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా,ఐశ్వ‌ర్యా రాజేష్,ఇసాబెల్లె డి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ర‌చ‌న‌, ద‌ర్శ‌కుడు: క‌్రాంతి మాధ‌వ్, స‌మ‌ర్ప‌కుడు: కేఎస్ రామారావు, నిర్మాత‌: కేఎ వ‌ల్ల‌భ‌, నిర్మాణ సంస్థ: క‌్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్, సంగీతం: గోపీసుంద‌ర్, సినిమాటోగ్ర‌ఫర్: జేకే ప్రొడ‌క్ష‌న్ డిజైన్: సాహీ సురేష్, పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here