Home Actor క్రిష్ తో అఖిల్ సినిమా..నిజ‌మా..?

క్రిష్ తో అఖిల్ సినిమా..నిజ‌మా..?

88
0

అక్కినేని అఖిల్ న‌టించిన తాజా చిత్రం మిస్ట‌ర్ మ‌జ్ను. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మించిన ఈ సినిమా స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. అఖిల్, హ‌లో చిత్రాలు ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయాయి. దీంతో మిస్ట‌ర్ మ‌జ్ను సినిమా పై చాలా ఆశ‌లు పెట్టుకున్నారు కానీ.. ఈ సినిమా కూడా ఆశించిన స్ధాయిలో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

దీంతో అఖిల్ నాలుగ‌వ సినిమా ఎవ‌రితో చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. శ్రీను వైట్ల‌తో అఖిల్ సినిమా క‌న్ ఫ‌ర్మ్ అయ్యింది అని వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత శ్రీను వైట్ల కాదు.. ఆది పినిశెట్టి సోద‌రుడు స‌త్య ప్ర‌భాస్ పినిశెట్టితో చేయ‌నున్నాడు అనే టాక్ వ‌చ్చింది. తాజాగా విభిన్న‌ క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ తో అఖిల్ సినిమా అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. విష‌యం ఏంటంటే…అఖిల్ న‌టించిన మూడు చిత్రాలు స‌క్స‌స్ కాక‌పోవ‌డంతో నాగార్జున అఖిల్ సినిమా విష‌య‌మై క్రిష్ తో మాట్లాడార‌ని..క్రిష్ తెర‌కెక్కిస్తోన్న మ‌హా నాయ‌కుడు రిలీజ్ త‌ర్వాత ఈ ప్రాజెక్ట్  పై క్లారిటీ వ‌స్తుంద‌ని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here