Home Actor క్రిస్మ‌స్ కానుక‌గా చైతు సినిమా..!

క్రిస్మ‌స్ కానుక‌గా చైతు సినిమా..!

33
0
క్రిస్మ‌స్ కానుక‌గా చైతు సినిమా..! spiceandhra

మ‌జిలీ సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకున్న నాగ చైత‌న్య‌.. ఫుల్ జోష్ తో వెంకీ మామ సినిమాలో న‌టిస్తున్నాడు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న వెంకీ మామ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమా త‌ర్వాత చైత‌న్య శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జరుగుతోంది.

సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ నుంచి షూటింగ్ స్టార్ చేయ‌నున్నారు. నాగ చైత‌న్య స‌ర‌స‌న సాయి ప‌ల్ల‌వి న‌టిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి భారీ క్రేజ్ ఏర్ప‌డింది. అటు యూత్ ను .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించేలా శేఖ‌ర్ క‌మ్ముల‌ ఈ కథపై కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమాలో న‌టించే మిగిల‌న న‌టీన‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేయ‌నున్నారు.

సెప్టెంబ‌ర్ లో  ప్రారంభించే ఈ సినిమాని నాన్ స్టాఫ్ గా షూటింగ్ చేసి క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ నెలాఖ‌రున రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here