Home Actor క‌థ విన‌గానే ఓ.. బేబి హిట్ సినిమా అనిపించింది – నాగ‌శౌర్య‌

క‌థ విన‌గానే ఓ.. బేబి హిట్ సినిమా అనిపించింది – నాగ‌శౌర్య‌

42
0
క‌థ విన‌గానే ఓ.. బేబి హిట్ సినిమా అనిపించింది - నాగ‌శౌర్య‌ spiceandhra

స‌మంత అక్కినేని, నాగ శౌర్య‌, సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన చిత్రం ఓ..బేబి. ఈ విభిన్న క‌థా చిత్రాన్ని నందినీ రెడ్డి తెర‌కెక్కించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్, క్రాస్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్ పై  సురేష్ బాబు, టి.జి.విశ్వప్ర‌సాద్‌, సునీత తాటి, హ్యున్ హు, థామ‌స్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 5న ఓ.. బేబి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే  మ్యాజికల్ బ్లాక్ బస్టర్ గా అటు ప్రేక్షకులు, ఇటు సినీ ప్ర‌ముఖుల నుంచి ప్రశంసలు పొందుతూ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది.

ఈ సంద‌ర్భంగా యంగ్ హీరో నాగ శౌర్య చిత్ర విశేషాల‌ను మీడియాకి తెలియ‌చేస్తూ… ఈ సినిమా క‌థ‌ను నందినీ రెడ్డి గారు ఇంటికొచ్చి చెప్పారు. నా క్యారెక్ట‌ర్ తక్కువుగా ఉంది అనిపించింది అయిన‌ప్ప‌టికీ ఓకే చెప్పేసాను. ఎందుకంటే… ఈ సినిమాలో నాకిష్ట‌మైన ల‌క్ష్మి గారు ఉన్నారు. మురారి సినిమా చూసిన త‌ర్వాత ల‌క్ష్మి గారితో క‌లిసి న‌టించాలి అనుకున్నాను. అంత‌కు ముందు ఒక‌సారి అనుకున్నాం కానీ.. కుద‌ర‌లేదు. ఇక ఇప్పుడు అవ‌కాశం వ‌చ్చింది. మిస్ చేసుకోకూడ‌దు అనిపించి ఓకే చెప్పేసాను.

అయితే.. సినిమా స్టార్ట్ అయ్యాకా.. గెస్ట్ రోల్ అనుకున్న నా క్యారెక్ట‌ర్ ని నందినీ రెడ్డి గారు ఫుల్ లెంగ్త్ రోల్ చేసారు. ల‌క్ష్మి గారి డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల‌న నాతోనే షూటింగ్ స్టార్ట్ చేసారు. ఆత‌ర్వాత ల‌క్ష్మి గారు జాయిన్ అయ్యారు. ఆవిడ సెట్లో ఉన్న‌ప్పుడు ఒక రోజు మొత్తం నేను, స‌మంత గారు అక్క‌డే ఉన్నాం. ల‌క్ష్మి గారిని ఒక‌సారి ప‌ల‌క‌రించాను. ఆత‌ర్వాత దూరం నుంచి చూస్తూ నిలుచున్నాను. ఎందుకంటే.. నాకు సిగ్గు ఎక్కువ‌. అంద‌రూ దాన్ని పొగ‌రు అనుకుంటారు. 

ఈ క‌థ విన‌గానే..మ‌ద‌ర్‌కి, ఫాద‌ర్‌కి, గ్రాండ్ మ‌ద‌ర్‌కీ ఇలా అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే సినిమా. ఖ‌చ్చితంగా హిట్ అవుతుంది అనిపించింది. నేను అనుకున్న‌ట్టుగానే కాదు… అంత‌కు మించి ఓ.. బేబి స‌క్స‌స్ సాధించ‌డం..అందులో నేను భాగం కావ‌డం చాలా సంతోషంగా ఉంది అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here