Home Telugu క‌మ‌ల్ విశ్వ‌రూపం 2 ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్..!

క‌మ‌ల్ విశ్వ‌రూపం 2 ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్..!

97
0
Viswarupam 2

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన విశ్వరూపం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం విశ్వరూపం 2. ఈ నెల‌ 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆస్కార్‌ ఫిలిం (ప్రై) లిమిటెడ్‌, వి.రవిచంద్రన్‌ సమర్పణలో రాజ్ కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్ బ్యాన‌ర్ పై నిర్మించిన ఈ భారీ చిత్రం పై ప్రేక్షకుల్లో చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి.

తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో, ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌లో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో ఈ మూవీని నిర్మించారు. క‌మ‌ల్ స‌ర‌స‌న పూజా కుమార్ న‌టించారు. ఇక తెలుగు వెర్షెన్ ఆడియో & ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైద‌రాబాద్ లో ఈ నెల 2న గ్రాండ్ గా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లో నిర్వహించనున్న‌ట్టు తెలియ‌చేస్తూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు.

కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: మహమ్మద్‌ గిబ్రాన్‌, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌, షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్‌, ఎడిటింగ్‌: మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, నిర్మాతలు: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌, రచన, దర్శకత్వం: కమల్‌హాసన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here