Home Political News క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌రువు హ‌త్య‌.!

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ప‌రువు హ‌త్య‌.!

91
0

తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ లో ప‌రువు హ‌త్య క‌ల‌క‌లం రేపింది. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని శంక‌ర‌ప‌ట్నం మండ‌లం తాడిక‌ల్ లో గ‌డ్డి కుమార్ అనే యువ‌కుడు అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతి చెందాడు. అత‌ని మ‌ర‌ణానికి ప్రేమ వ్య‌వ‌హార‌మే కార‌ణం అంటున్నారు గ్రామ‌స్ధులు. పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేదంటూ ఆగ్ర‌హంతో పోలీసుల వాహ‌నాన్ని ధ్వంసం చేసారు. కుమార్ హ‌త్య‌ను నిర‌సిస్తూ క‌రీంన‌గ‌ర్ – వ‌రంగ‌ల్ జాతీయ ర‌హ‌దారి పై రాస్తారోకో చేసారు.

అస‌లు విష‌యం ఏంటంటే… కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమ విషయంలో ఆ..అమ్మాయి కుటుంబ సభ్యులు కుమార్‌తో గొడవపడ్డట్లు తెలుస్తుంది. యువతిని మర్చిపోవాలని లేదంటే చంపేస్తామని యువకుడిని చాలా సార్లు హెచ్చరించారట‌. అయినప్పటికీ.. ఆ యువతితో కుమార్ ప్రేమను కొనసాగించాడ‌ట‌.ఈ క్రమంలో గత రాత్రి తాడికల్ శివారులో కుమార్ శవమై కనిపించాడు. అమ్మాయి బంధువులే కుమార్‌ని హత్య చేశారని యువకుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఏసీపీ కృపాక‌ర్ ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని మృతుడు కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడారు. విచారణ జరిపి చర్యలు చేపడతామని ఆయ‌న‌ హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిందని స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here