Home Actor క‌ల్కి రివ్యూ

క‌ల్కి రివ్యూ

59
0
క‌ల్కి రివ్యూ. #spiceandhra

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కిస‌. గ‌రుడ‌వేగ సినిమా స‌క్స‌స్ త‌ర్వాత రాజ‌శేఖ‌ర్ న‌టించిన సినిమా కావ‌డం..క‌ల్కి ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డం..దీనికి తోడు అ..అనే కొత్త త‌ర‌హా చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సినిమా ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఈ సినిమా పై పాజిటివ్ టాక్ ఉంది. మ‌రి..రాజ‌శేఖ‌ర్ మ‌రో స‌క్స‌స్ సాధించాడా..?  ప్ర‌శాంత్ వ‌ర్మ ద్వితీయ విఘ్నం దాటాడా..?   లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌ల్కి క‌థ చెప్పాల్సిందే.

క‌థ – ఇది 1983లో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు ఆధారంగా రూపొందిన క‌థ‌. ఇందులో క‌ల్కి (రాజ‌శేఖ‌ర్) పోలీసాఫీస‌ర్. కొల్లాపూర్ లో న‌ర్స‌ప్ప‌, పెరుమాళ్లు మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతుంటాయి. ఈ గొడ‌వ‌ల్లో న‌ర్స‌ప్ప సోద‌రుడు శేఖ‌ర్ బాబుని దారుణంగా హ‌త్య చేస్తారు. అస‌లు హ‌త్య చేసింది ఎవ‌రు అనేది తెలుసుకునేందుకు క‌ల్కి అక్క‌డ‌కు వ‌స్తాడు.

ఇదిలా ఉంటే..క‌ల్కి డాక్ట‌ర్ ప‌ద్మ (ఆదా శ‌ర్మ‌)ను ప్రేమిస్తాడు. ఊహించ‌ని సంఘ‌ట‌న వ‌ల‌న కల్కి, ప‌ద్మ మధ్య విభేదాలు వ‌స్తాయి.  కొల్లాపూర్ వ‌చ్చిన క‌ల్కి ఆప‌ద‌లో ఉన్న హ‌సీనా (నందితా శ్వేత‌)ను కాపాడ‌తాడు. దీంతో క‌ల్కి, హ‌సీనా ప్రేమించుకుంటున్నారేమో అనుకుంటుది. ఈ క్ర‌మంలో ఏం జ‌రిగింది..?  అస‌లు శేఖ‌ర్ బాబుని ఎవ‌రు హ‌త్య చేసారు..? క‌ల్కి, ప‌ద్మ మ‌ధ్య విభేదాలు ఎందుకు వ‌చ్చాయి..?  చివ‌రికి క‌ల్కి ఈ మిస్ట‌రీని ఎలా చేధించాడు అనేదే మిగిలిన క‌థ‌.

విశ్లేష‌ – కొల్లాపూర్ లో జ‌రిగిన గొడ‌వ‌ల‌తో సినిమా స్టార్ట్ అవుతుంది. శేఖ‌ర్ బాబుని హ‌త్య చేయ‌డంతో..అస‌లు ఎవ‌రీ శేఖ‌ర్ బాబు..? ఎందుకు హ‌త్య చేసారు..? అని ఇంట్ర‌స్టింగ్ క‌లిగిస్తుంది. రాజ‌శేఖ‌ర్ చాలా కూల్ గా స్టైల్ గా పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో ఎంట్రీ ఇవ్వ‌డం బాగుంది. జ‌ర్న‌లిస్ట్ దేవ‌ద‌త్తా పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ అప్ప‌డ‌ప్పుడు టెన్ష‌న్ పెడుతూ.. న‌వ్విస్తూ.. పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా చాలా బాగా న‌టించాడు. రాజ‌శేఖ‌ర్, ఆదాశ‌ర్మ‌ల ల‌వ్ స్టోరీ ఎపిసోడ్ ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. అయితే…ఫ‌స్టాఫ్ క‌థ ముందుకు వెళ్ల‌క‌పోవ‌డంత‌ స్లోగా ఉన్న‌ట్టు అనిపిస్తుంది.

ఇక సెకండాఫ్ లో బిగినింగ్ కూడా స్లోగానే అనిపించినా…ట్విస్టులు రివీల్ చేయ‌డంతో ఇంట్ర‌స్ట్ పెరుగుతుంది. సినిమా అంతా ఒక ఎత్తు అయితే..చివ‌రి 20 నిమిషాలు మ‌రో ఎత్తు అని చెప్ప‌చ్చు. నందితా శ్వేత చెప్పే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి హైలెట్. ఇది సినిమాని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లింది. రాశేఖ‌ర్ యాక్టింగ్, కెమెరావ‌ర్క్, మ్యూజిక్ సినిమాకి ప్ల‌స్. డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ దీనికి త‌గ్గ‌ట్టుగా స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. అయితే…ఏ క‌థ చెప్పినా సామాన్య ప్రేక్ష‌కుల‌కు క్లియ‌ర్ గా అర్ధం అయ్యేలా చెబితే ఆ సినిమా విజ‌యం సాధిస్తుంది.

అలా కాకుండా..సినిమాకి వ‌చ్చిన ప్రేక్ష‌కులకి ప‌రీక్ష పెట్టిన‌ట్టుగా కొంచెం అర్ధం అయి అర్ధం కాన‌ట్టుగా తీస్తే..ఆ సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందడం క‌ష్టం. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే… కామ‌న్ ఆడియ‌న్స్ క‌న్ ఫ్యూజ్ అయ్యేలా ఉంది. అలా కాకుండా అంద‌రికీ అర్ధం అయ్యేలా తీసుంటే  బాగుండేది.

రేటింగ్ – 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here