Home Political News క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌న్నూరి న‌ర్సిరెడ్డి బ‌హిరంగ లేఖ‌.

క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌న్నూరి న‌ర్సిరెడ్డి బ‌హిరంగ లేఖ‌.

120
0
maxresdefault

విలేక‌రుల స‌మావేశంలో మా పార్టీ అధ్య‌క్షులు ఎల్.ర‌మ‌ణ గారి పై కాంగ్రెస్, టీడీపీ పొత్తుల పై అతిగా స్పందించిన క‌ల్వ‌కుంట్ల క‌విత మీ స్పంద‌న‌కు స‌మాధానంగా నేను ఈ బ‌హిరంగ లేఖ రాస్తున్నా. ముందు మా ప్ర‌శ్న‌ల‌కు సూటిగా స‌మాధానం ఇవ్వండి. మ‌మ‌హా కూట‌మి నేత‌ల‌కు నీతులు చెబుతున్న క‌ల్వ‌కుంట్ల క‌విత ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ జాగృతి పేరిట సంస్థ‌ను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయ‌లు వ‌సూలు చేసిన నీ జాగృతి లెక్క‌లు ఎందుకు బ‌హిర్గ‌తం చేయ‌లేదు. విప‌క్షాల‌కు చెందిన వారి పై ఐటీ దాడులు చేయిస్తూ..వారి అఫిడ‌విట్ ల‌ను చూపిస్తూ..ప్ర‌శ్న‌లు సంధించే మీరు మేము అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాలి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉద్య‌మాలు న‌డిపిన ప్ర‌తి కుటుంబం స‌ర్వ‌నాశనం అయితే..తెలంగాణ ఉద్య‌మాన్ని న‌డిపిన మీ కుటుంబం ఆర్ధికంగా, రాజ‌కీయంగా ఉద్య‌మాన్ని ఎలా వాడుకున్నారో ముందు స‌మాధానం చెప్పు.

1 ఉద్య‌మ స‌మ‌యంలో మీరు ఏర్పాటు చేసిన జాగృతి సంస్థ ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వ‌ర‌కు జాగృతి పేరిట చేసిన వ‌సూళ్ల ఆదాయం ఖ‌ర్చు వివ‌రాలు ఎప్ప‌టిలోగా బ‌హిర్గ‌తం చేస్తారు.

2 ఉద్య‌మంలో ఉన్నామ‌ని చెప్పుకుంటున్న మీ కుటుంబానికి ఉద్య‌మ స‌మ‌యంలోనే న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక టీ ఛాన‌ల్ తో పాటు భూములు, ఫాం హౌస్ లు, భ‌వ‌నాలు ఎక్క‌డ నుంచి వ‌చ్చాయో చెప్ప‌గ‌ల‌రా..?

3 ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ ద్రోహులుగా మీ కుటుంబం ముద్ర వేసిన వారినే మీ ప్ర‌భుత్వం మంత్రి వ‌ర్గంలో మంత్రులుగా ఎందుకు అవ‌కాశం ఇచ్చారో తెలంగాణ స‌మాజానికి చెప్ప‌గ‌ల‌రా..?

4 గ‌తంలో జేఏసీ క‌న్వీన‌ర్ గా ఉన్న కోదండ‌రామ్ పొగిడిన మీ కుటుంబం తెలంగాణ వ‌చ్చాక ఎందుకు విమ‌ర్శిస్తున్నారో చెప్ప‌గ‌ల‌రా..?

5 గ‌తంలో జీవ‌న్ రెడ్డి, ఎల్.ర‌మ‌ణ‌లు ప‌ర‌స్ప‌రం చేసుకున్న విమ‌ర్శ‌ల‌ను ప్ర‌స్తావిస్తున్న మీరు గతంలో కేసీఆర్ ని హైద‌రాబాద్ లో అడుగు పెట్ట‌నీయ‌న‌న్న స‌మైక్య‌వాది త‌ల‌సాని దానం నాగేంద‌ర్ ల‌ను మీ పార్టీలో ప్ర‌భుత్వంలో ఎందుకు చేర్చుకున్నారో తెలంగాణ స‌మాజానికి స‌మాధానం చెప్పండి.

6 తెలంగాణ‌ను మోసం చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ ఏకం అయ్యాయ‌ని మాట్లాడే మీరు మీ న‌లుగురు కుటుంబ స‌భ్యులు ఏక‌మై యావ‌త్తు తెలంగాణ ప్ర‌జానీకానికి చేస్తున్న ద్రోహాన్ని కాంగ్రెస్, టీడీపీ ప్ర‌శ్నిస్తాయ‌ని ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలుస్తాయ‌నే క‌దా ఎదురుదాడి చేస్తుంది నిజామా..?  కాదా..?

7 జ‌గిత్యాల మున్సిపాలిటీలో ఉన్న అవినీతి ప్ర‌పంచంలో ఎక్క‌డా లేద‌ని మాట్లాడే క‌విత మీ అన్న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీలో రెండు శాతం క‌మీష‌న్లు కేటీఆరే తీసుకొమ్మ‌న్నాడ‌ని మున్సిప‌ల్ ఛైర్ ప‌ర్స‌న్ పావ‌ని మీడియా స‌మ‌క్షంలో వెల్ల‌డించింది. దానికి ఏం స‌మాధానం చెబుతారు.

8 సింగ‌రేణి ఉద్యోగుల పైర‌వీల్లో మీ పేరు వ‌చ్చిన‌ప్పుడు మీ నిజాయితీ నిరూపించుకోవ‌డానికి చ‌ట్ట‌బ‌ద్ద రాజ్యాంగ బ‌ద్ద‌మైన సిట్టింగ్ జ‌డ్జీ చేత విచార‌ణ చేయించ‌మ‌ని మీ తండ్రి గారిని ఎందుకు కోర‌లేదో స‌మాధానం చెప్పు.

9 తెలంగాణ బ‌తుక‌మ్మ‌కే బ్రాండ్ అంబాసిడ‌ర్ గా చెప్పుకుంటున్న మీరు క్యాబినెట్ మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా మ‌హిళ‌ల‌ను అవ‌మానించిన దానికి ఏం స‌మాధానం చెబుతావ్..? త‌ండ్రి, కూతురు మాట‌ల‌తో, అల్లుడు హ‌రీష్ రావు లేఖ‌ల‌తో, కొడుకు ప్ర‌క‌ట‌న‌ల‌తో తెలంగాణ స‌మాజాన్ని మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం ఎంత చేసినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మీ కోత‌ల‌కు తెలంగాణ ప్ర‌జ‌లు వాత‌లు పెట్ట‌డం ఖాయం.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here