Home Telugu క‌ళ్యాణ్‌ రామ్ నా నువ్వే ప్ర‌యోగం ఫ‌లించేనా..?

క‌ళ్యాణ్‌ రామ్ నా నువ్వే ప్ర‌యోగం ఫ‌లించేనా..?

100
0

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించిన లేటెస్ట్ మూవీ నా నువ్వే. క‌ళ్యాణ్ రామ్ – త‌మ‌న్నా జంట‌గా న‌టించిన ఈ చిత్రాన్ని జ‌యేంద్ర తెర‌కెక్కించారు. కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ పతాకం పై కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌ వట్టికూటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ పై మ‌హేష్ ఎస్ కోనేరు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈరోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో నా నువ్వే ట్రైల‌ర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే..ఇది ఒక రొమాంటిక్ & ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీ అని తెలుస్తుంది.

ఇందులో క‌ళ్యాణ్ రామ్ చాలా కొత్త‌గా..చాలా అందంగా క‌నిపిస్తున్నాడు. అలాగే మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మ‌రింత అందంగా క‌నిపిస్తోంది. జ‌న‌ర‌ల్ గా హీరో…హీరోయిన్ ప్రేమ కోసం త‌పిస్తుంటారు కానీ..ఇందులో వెరైటీగా త‌మ‌న్నా…క‌ళ్యాణ్ రామ్ ప్రేమ కోసం త‌పిస్తుంటుంది. నా ప్రేమ‌..బాధ అంద‌రికీ విన‌ప‌డుతుంది. నీకు వినిపించ‌డం లేదా..? అని అడుగుతుంది. ఇదంతా చూస్తుంటే..యూత్ కి క‌నెక్ట్ అయ్యేలాగే క‌నిపిస్తుంది.

పి.సి.శ్రీరామ్ కెమెరా ప‌నిత‌నం, శ‌ర‌త్ సంగీతం, కూల్ బ్రీజ్ సినిమాస్, ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణం..ఇవ‌న్నీ క‌లిపి నా నువ్వే సినిమాలో ఏదో విష‌యం ఉంద‌నిపిస్తోంది.అయితే…యాక్ష‌న్ సీన్స్ లో, ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ చెప్ప‌డంలో అద‌రగొట్టే నంద‌మూరి క‌ళ్యాణ్ ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీ చేయ‌డం అనేది ఓ ప్ర‌యోగ‌మే. మ‌రి…క‌ళ్యాణ్ రామ్ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా..?  లేదా..?  అనేది ఈనెలాఖ‌రున తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here