Home Movie News క‌ళ్యాణ్ రామ్ క‌ల నెర‌వేరకుండానే..

క‌ళ్యాణ్ రామ్ క‌ల నెర‌వేరకుండానే..

96
0
_Kalyan Ram (13)1528882568

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఓ వైపు హీరోగా న‌టిస్తూనే..మ‌రో వైపు నిర్మాత‌గా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల త‌మ్ముడు ఎన్టీఆర్ తో జై ల‌వ‌కుశ సినిమా నిర్మించారు. అయితే..ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై తండ్రి హ‌రికృష్ణ‌, త‌మ్ముడు ఎన్టీఆర్ లతో ఓ భారీ చిత్రాన్ని నిర్మించాల‌ని..ఇందులో త‌ను కూడా న‌టించాల‌ని అనుకున్నారు. ఈ విష‌యాన్ని క‌ళ్యాణ్ రామ్ ఓ సంద‌ర్భంలో చెప్ప‌డం కూడా జ‌రిగింది.

ఈ నంద‌మూరి మ‌ల్టీస్టార‌ర్ కోసం అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ భారీ చిత్రం కోసం క‌థ చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయని వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం గురించి ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారా అని అభిమానులు గ‌త కొంత కాలంగా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయ‌తే..ఈరోజు హ‌రికృష్ణ మ‌ర‌ణించ‌డంతో క‌ళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ షాక్ అయ్యారు. హ‌రికృష్ణ‌, క‌ళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఈ ముగ్గురిని ఒకే సినిమాలో చూడాల‌నుకున్న అభిమానులు ఇలా జ‌ర‌గ‌డంతో తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here