Home Telugu క‌ళ్యాణ్ రామ్ భారీ మ‌ల్టీస్టార‌ర్ లో న‌టించే స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..?

క‌ళ్యాణ్ రామ్ భారీ మ‌ల్టీస్టార‌ర్ లో న‌టించే స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..?

159
0

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నార‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ చిత్రానికి ప‌వ‌న్ సాదినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అయితే…క‌ళ్యాణ్ రామ్ తో పాటు ఓ స్టార్ హీరో న‌టించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది కానీ…ఆ స్టార్ హీరో ఎవ‌రు అనేది బ‌య‌ట‌కు రాలేదు. నంద‌మూరి హీరోలు ఎన్టీఆర్ కానీ, హ‌రికృష్ణ కానీ.. న‌టించే అవ‌కాశం ఉంది అనే టాక్ వినిపించింది. ఇదిలా ఉంటే…ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అది ఏంటంటే…ఇందులో న‌టించేది నంద‌మూరి హీరో కాదట‌. అక్కినేని హీరో అట‌. ఇంత‌కీ..అక్కినేని హీరో ఎవ‌రో కాదు కింగ్ నాగార్జున అని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ప‌వ‌న్ సాదినేని నాగార్జున‌కు క‌థ చెప్ప‌డం…క‌థ‌లో కొత్త‌ద‌నం ఉండ‌డంతో నాగ్ ఓకే చెప్ప‌డం జ‌రిగింద‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఆగ‌ష్టులో ఈ సినిమాని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని సమాచారం. ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మించ‌నున్నారు.

ప్ర‌స్తుతం నాగార్జున నానితో క‌లిసి చేస్తోన్న సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా పూర్త‌వ్వ‌గానే క‌ళ్యాణ్ రామ్ మూవీలో న‌టిస్తార‌ట‌. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తార‌ని తెలిసింది. ఇదే క‌నుక నిజ‌మైతే…అక్కినేని హీరో, నంద‌మూరి హీరో క‌లిసి న‌టించే ఈ మ‌ల్టీస్టార‌ర్ కి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here