Home Actor క‌ళ్యాణ్ రామ్ 118 రివ్యూ..!

క‌ళ్యాణ్ రామ్ 118 రివ్యూ..!

115
0

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ స్టైలిష్ యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ 118. నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా న‌టించారు. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేసిన‌ప్పుడు కొత్త‌గా ఉంది. అస‌లు క‌థ ఏంటి..? అనే ఇంట్ర‌స్ట్ క‌లిగింది. దీనికి తోడు టీజ‌ర్ & ట్రైల‌ర్ కూడా ఇంట్ర‌స్టింగ్ గా ఉండ‌డంతో సినిమా పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై మ‌హేష్‌ కొనేరు నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు (మార్చ్ 1న) విడుద‌లైంది. మ‌రి..118 ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందా..? లేదా..? ఎలాంటి ఫ‌లితాన్ని అందించింది అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ – గౌత‌మ్ (క‌ళ్యాణ్ రామ్) ఇన్వేస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్. అత‌నికి మేఘ (షాలిని పాండే)తో వివాహం కుదురుతుంది. అయితే..గౌత‌మ్ ఓ రోజు రిసార్ట్ లోని 118లో ఉన్న‌ప్పుడు ఓ క‌ల వ‌స్తుంది. ఆ క‌ల‌లో ఆద్య (నివేథా థామ‌స్) ఆప‌ద‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఒక‌సారి మాత్ర‌మే కాకుండా మ‌ళ్లీ మ‌ళ్లీ అదే క‌ల వ‌స్తుంటుంది. దీంతో ఎందుకు ఆ క‌ల వ‌స్తుందో తెలుసుకోవాల‌నుకుంటాడు. 118 రూమ్ లో ఉన్న వేరే వాళ్ల‌కి కూడా త‌న‌కి వ‌చ్చిన క‌లే వ‌చ్చింద‌ని తెలుసుకుంటాడు. ఇంత‌కీ..ఆ క‌ల ప‌దే ప‌దే ఎందుకు వ‌స్తుంది..? ఆ రూమ్ లో ఉన్న వారికి మాత్ర‌మే ఎందుకు వ‌స్తుంది..? ఈ క‌ల గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నంలో గౌత‌మ్ కి ఎదురైన సంఘ‌ట‌న‌లు ఏంటి..? చివ‌రికి ఏం జ‌రిగింది అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

క‌ళ్యాణ్ రామ్, నివేథా న‌ట‌న‌

రీ రికార్డింగ్

మైన‌స్ పాయింట్

క‌థ‌

లాజిక్స్ లేక‌పోవ‌డం

విశ్లేష‌ణ – క‌ళ్యాణ్ రామ్, ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన గుహ‌న్ కొత్త సినిమా అందించాల‌ని ప్ర‌య‌త్నం చేసారు. హీరో క‌ల‌లోకి వ‌చ్చిన అమ్మాయి ఆప‌ద‌లో ఉండ‌డం..ఆమెకు ఏమైందో హీరో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం అనే పాయింట్ ను కొత్త‌గా చూపించాల‌ని చేసిన ప్ర‌య‌త్న‌మే హీరో క‌ల‌లోకి వెళ్ల‌డం. ఇది సైన్స్ ద్వారా సాధ్య‌మే అని చెప్పారు. ఆద్య‌కి ఏమైందో గౌత‌మ్ తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటే విల‌న్స్ అడ్డుపడుతుంటారు. దీంతో గౌత‌మ్ మ‌ళ్లీ త‌న‌కి క‌ల వ‌స్తే..ఏం జ‌రిగిందో తెలుసుకోవ‌చ్చు అనుకుంటాడు. అందుకోసం డాక్ట‌ర్ ని సంప్ర‌దించ‌డం..మ‌ళ్లీ 118 రూమ్ కి వెళ్లి క‌ల ద్వారా ఏం జ‌రిగిందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తాడు. అయితే.. సినిమా చూస్తున్న ప్రేక్ష‌కుల‌కి వ‌చ్చే సందేహం ఏంటంటే…ఆద్యకి ఏమైందో తెలుసుకోవాల‌నుకుంటే విల‌న్స్ ని ప‌ట్టుకుంటే అస‌లు విష‌యం తెలుస్తుంది క‌దా..? అని. ఫ‌స్టాప్ బాగానే ఉన్న‌ప్ప‌టికీ సెకండాఫ్ మాత్రం ఇంట్ర‌స్టింగ్ గా అనిపించ‌దు. కొన్ని సీన్స్ లో హీరో క్యారెక్ట‌ర్ స‌స్పెన్స్ గా ఫీల‌వుతుంటాడు కానీ..ఆడియ‌న్ మాత్రం ఫీల‌వ‌రు. శేఖ‌ర్ చంద్ర రీ రికార్డింగ్ బాగుంది. అలాగే ద‌ర్శ‌కుడు గుహ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్ కూడా కావ‌డంతో ప్ర‌తి సీన్ చాలా రిచ్ గా ఉంది. ఫైన‌ల్ గా ఈ సినిమా గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే…ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేని 118.

రేటింగ్ – 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here