Home Political News క‌వాతులో యువ‌త పాల్గొన‌డానికి కార‌ణం ఇదే – ప‌వ‌న్.!

క‌వాతులో యువ‌త పాల్గొన‌డానికి కార‌ణం ఇదే – ప‌వ‌న్.!

91
0

జనసైనికులతో ధవళేశ్వరం వంతెనపై భారీ కవాతు నిర్వ‌హించారు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈ క‌వాతుకు గోదావ‌రి జిల్లాల నుంచే కాకుండా మిగిలిన జిల్లాల నుంచి వేలాది మంది జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, యువ‌కులు పాల్గొని విజ‌య‌వంతం చేసారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ మాట్లాడుతూ.. క‌వాతు మిల‌ట‌రీ సైనికులు చేస్తారు. సామాన్య ప్ర‌జ‌లు చేయ‌రు. ఎందుకు మ‌నం క‌వాతు చేయాల్సివ‌చ్చింది అని ప్ర‌శ్నించారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌ని జనం వ‌స్తున్నారా..? కాదు…! స‌గ‌టు రాజ‌కీయ వ్య‌వ‌స్ధ కుళ్లిపోయి అవినీతితో నిండిపోయి నిరుద్యోగంతో ర‌గిలిపోతున్న యువ‌త ఈరోజు ఎందుకు న‌డుం బిగించి క‌వాతులో పాల్గొంది అంటే..అవినీతి ప్ర‌క్షాళ‌న చేయ‌డానికి..! దోపిడీ వ్య‌వ‌స్థ‌ను నిర్మూలించ‌డానికి అని తెలియ‌చేసారు. సగటు ప్రజాస్వామ్య విభాగాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వ్యవస్థ నిర్వీర్యమైపోతుంటే.. సామాన్యులు.. మధ్యతరగతి మేధావులు, ఆడపడుచుల నుంచి ఒక విప్లవం రావాలి. రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలి. వారిని నిలదీయాలి. దోపిడీని నిలువరించేందుకే ఈ కవాతు చేస్తున్నాం. దౌర్జన్యాన్ని చీల్చిచెండాడే కొదమ సింహాలు నా జన సైనికులు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here