Home Political News ఖైర‌తాబాద్ లో కాంగ్రెస్ ఇంటింటికి ప్ర‌చారం ప్రారంభం..!

ఖైర‌తాబాద్ లో కాంగ్రెస్ ఇంటింటికి ప్ర‌చారం ప్రారంభం..!

95
0

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేతలు ఖైరతాబాద్‌లో ఇంటింటికీ కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈరోజు ఉదయం ఖైరతాబాద్‌ మహంకాళి పోచమ్మ ఆలయంలో కాంగ్రెస్ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్మదర్శులు బోస్‌రాజు, అహ్మద్‌, శ్రీనివాసన్‌, భట్టి విక్కమార్క, సంపత్‌ కుమార్‌, అంజన్ కుమార్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారాన్ని నేతలు ప్రారంభించారు.

తెరాస్ వైఫ‌ల్యాల పై కాల‌నీలు, బ‌స్తీల‌లో ప్ర‌చారం చేస్తున్నారు. హైద‌రాబాద్ జిల్లాలోని 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర కొన‌సాగుతుంది. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ నేత భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ..సామాజిక తెలంగాణ కోస‌మే ప్ర‌త్యేక రాష్ట్రం ఇచ్చారు. దొర పాల‌న కాదు.. ప్ర‌జా ప్ర‌భుత్వం కావాల‌న్నారు. మ‌హంకాళి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాం.ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌న్నారు. మరో వైపు ఈ ప్రచారంలో నేతల మధ్య గొడవ నెలకొంది. నియోజకవర్గంలో ప్రచారం, పాదయాత్ర సమాచారం ఇవ్వలేదంటూ స్థానిక నేత రాజు యాదవ్‌, అనుచరుల ఆందోళనకు దిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here