Home News గంగ పుత్రుల ఓటు బ్యాంక్ ఎటు వైపు..?

గంగ పుత్రుల ఓటు బ్యాంక్ ఎటు వైపు..?

118
0

ఎన్నికల నోటిఫికేషన్ దగ్గర పడుతుండడంతో  వాతావరణం వేడేక్కుతుంది. అన్ని వర్గాలను ఆక్షర్షించడానికి అధికార పక్షం శతవిధాలుగా ప్రయత్నిస్తుంటే  ఏ చిన్న ఛాన్స్ దొరికిన తమ వైపు మలుచుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా కీలకమైన గంగపుత్రుల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ ప్రభుత్వ హాయాంలో  మత్య్సకారులు ఫసక్ అయిపోయారని  ఎస్ టిలుగా గుర్తిస్తాం , ఎం ఎల్ సి ఇస్తామని ఇచ్చిన హామీలు నేరవేరాయా అంటు వారిలో వారికి చర్చించుకునేలా ప్రతిపక్షాలు ఊసిగొలుపుతున్నాయి. మత్య్సకార ఓటు బ్యాంకు సాధారణంగా టిడిపికి మద్దతిస్తుంటారు.  వారి ఓటు బ్యాంకును ఈ సారి ఎన్నికలలో  వైఎస్ ఆర్, జన సేన పార్టీల వైపు మొగ్గు చూపేలా ప్రయత్నాలు చాపకింద నీరులా కదుపుతున్నారు. ఏపీలో సుధీర్ఘ ప్రాంతమైన తీరం ఉంది. ఇప్పటికే మత్య్సకారులకు ప్రభుత్వం 50 ఏళ్లకే పింఛన్, ఏప్రిల్ వచ్చే  వేటసెలవు సమయంలో సహాయం, సబ్సీడి తో అయిల్ , ఇంజన్ బోట్లు , వలలు వంటి ఆకర్షిత పథకాలను అందిస్తూ గంగ పుత్రులకు అండగా ఉంటామని ఆ పార్టీ చెబుతుంది. 

అయినా మత్య్సకారుల ను ఎస్ టి జాబితాలో చేర్పించాలంటు పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమం తరువాత ప్రభుత్వం ఇచ్చిన హామీని నేరవేరకపోవడంతో వారు అసంతృప్తిలో ఉన్నారు.  2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా  శ్రీకాకుళం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో స్వయంగా ముఖ్యమంత్రిచంద్రబా బునాయుడు వారిని ఎస్ టి లు గుర్తిస్తామన్నారు.  ఎం ఎల్ సి పదవీని కట్టబెడతామన్నారు.  కాని ఈ రెండు హామీలు  నేరవేరలేదు. ఈ నేపద్యంలో ఎస్ టి సాధన కోసం పెద్ద ఎత్తున గతంలో ఉద్యమించారు. వీరి ఉద్యమానికి అటు టిడిపి ఇటు వైసీపీలు సంఘీభావం తెలిపాయి. చివకు కమిటి ఫార్మషన్ వరకురాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రయత్నించడంతో వారితో చర్చలు జరిపి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప జేసారు. ఇన్నాళ్ల స్తబ్దతగా ఉన్న మత్య్సకార గ్రామాల్లో ఇపుడు మళ్లీ రాజకీయ చిచ్చు రేగుతుంది. దీనిపై  టిడిపి  అంతర్గతంగా చర్చించుకుంటుంది.

అందులో  శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఎచ్చెర్ల, శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్చాపురం సిగ్మెంటులలో మత్య్స కార ఓటు బ్యాంకు కీలకంగా నే ఉంది.  ఈ సిగ్మెంట్లలో పరిశీలిస్తే ఎచ్చెర్ల   మినహా మిగిలిన సిగ్మెంటు శ్రీకాకుళం పార్లమెంటులోకి వస్తాయి. ఇక ప్రభుత్వంలో కీలకంగా ఉన్న  రాష్ట్ర మంత్రి కిమిడి కళావెంకటరావు ఎచ్చెర్ల నుంచి  మరో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు టెక్కలినుంచి ఆదిపత్యం వహిస్తున్నా రు.  శ్రీకాకుళం నుంచి గుండ లక్ష్మీదేవి, ఇచ్చాపురం నుంచి బెందాళం అశోక్ ,పలాస నుంచి గౌతు శ్యాంసుందరశివాజీ, నరసన్నపేటనుంచి బగ్గు రమణమూర్తిలున్నారు. వీరందరు టిడిపి ఎమ్మేల్యేలే.  శ్రీకాకుళం పార్లమెంటు నుంచి ఆదిపత్యం వహిస్తున్న కింజరాపు రామ్మోహాన్ నాయుడు విజయంపై మత్య్సకార ఓటు బ్యాంకు ప్రభావం అధికంగా ఉంటుంది. జిల్లాలో 104  మత్య్సకార గ్రామాలుండగా లక్షకు పైగా జనాభా ఉన్నారు. గ్రామాల్లో పార్టీ పరంగా వర్గపోరు ఎక్కడికక్కడ ఉ న్నప్పటికి సామాజికం అందరికి కలిసి వచ్చే అంశాలపై  ఇప్పుడు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

అధికార పార్టీకి దూరమవుతున్నారని భావించిన ఆ సామాజిక వర్గాన్ని  తమ వైపు తిప్పుకునేందుకు ప్రధానంగా వైసీపీ , జనసేన పావులు కదుపుతుంది. వైసీపీ నుంచి ఆ తెగకు చెందిన సీదిరి అప్పలరాజు ను    పలాస సిగ్మెంటు నుంచి బరిలో దించేందుకు సిద్ధమైంది.  ఈ నేపద్యంలో ఇప్పటికే వైసీపీ నేత ఆర్ కే రోజా ను ఆ సిగ్మెంటులోని  వజ్రపు కొత్తూరు మండలంలో గంగపుత్రులకు పట్టుఉండడంతో  నువ్వుల రేవులో ప్రచారానికి వచ్చారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి మత్య్సకారులను ప్రభుత్వం మోసం చేసిందంటు  ఆరోపించారు.   అలానే మత్య్సకార పోరాట సాధన కమిటి కూడ తమపోరాటాన్ని టిడిపి గుర్తించడం లేదంటు రోడ్డేక్కుతున్నారు. శ్రీకాకుళం సిగ్మెంటులో గార మండలంనకు చెందిన కొందరు మత్య్సకారులు ఆ పార్టీ పదవులకు  రాజీనామా చేసారు. చాపకింద నీరులా గంగపుత్రు లు అధికార పార్టీకి దూరమవుతున్నారని పార్టీ ఇంటిలిజెన్స్ వర్గాలు  హెచ్చరిస్తున్నట్టు సమాచారం . దీనిపై శ్రీకాకుళం జిల్లా టిడిపి సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. సిఎం దృష్టికి తీసుకేళ్లేందుకు యత్నాలు చేస్తున్నట్టు  తెలుస్తొంది.

ఇలా ఉంటే  ముందునుంచి  జనసేన గంగపుత్రులకు అండగా ఉంటుందనే మెసేజ్ ఉంది.  గతంలో ఏ పార్టీ, నేతలు  వ్యవహారించని చందంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సిగ్మెంటులో మత్య్సకార గ్రామంలో సముద్ర స్నానం ఆచరించి గంగమ్మను పూజించి తన ప్రచారాన్ని చేపట్టారు. అంతే కాకుండా అదే ప్రాంతంలో ప్రజల ప్రాణాలు తోడేస్తున్న కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు రంగంలోకి దిగడంతో వారికి న్యాయం జరిగింది.  ఈనేపద్యంలో మత్య్సకారులు పవన్ వైపు అడుగులు వేస్తున్నారనే  రాజకీయ విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు.  ఇప్పటికే యూత్ ఆ పార్టీ గుర్తు  అయిన గాజు గ్లాస్ ను పట్టుకుని విస్తృతం గా  ప్రచారం చేస్తున్నారు.

  సినీ నటుడిగా కూడ మత్య్సకార యువ త పవన్ అంటే పడిచచస్తారు. గంగపుత్రులు ఎస్ టి లుగా గుర్తించాలంటు చేసిన  పోరాట సమయంలో కూడ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎన్నికల హామీని పెడచెవిన పెట్టి మత్య్సకారుల పై టిడిపి సవతితల్లి ప్రేమ  చూపిస్తుందంటు విరుచుకుపడ్డారు. ఇలా వైసీపీ, జనసేన మత్య్సకార ఓట్లను గాలం వేసే పనిలో ఉండగా టిడిపి మాత్రం అందుకు చిక్కకుండా కొత్త వ్యూహాం కోసం పావులు కదుపుతుంది. మరీ.. ఐకమత్యంలో తమకు తీసిపోరనే కట్టుబాట్లు ఉన్న గంగపుత్రులను ఈసారి ఏ పార్టీ గాలం వేస్తే అటు వైపు విజయావకాశాలుంటాయని రాజకీయ విశ్లేషుకులు సైతం భావిస్తున్నారు. మరి రానున్న ఎన్నికలలో ఈ ఓటు బ్యాంకు ఎటు వైపు పయనిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here