Home Actor గిర గిర గిర తిరగలిలాగా .. తిరిగి అరిగిపోయినా అంటున్న కామ్రేడ్..!

గిర గిర గిర తిరగలిలాగా .. తిరిగి అరిగిపోయినా అంటున్న కామ్రేడ్..!

74
0
గిర గిర గిర తిరగలిలాగా .. తిరిగి అరిగిపోయినా అంటున్న కామ్రేడ్..! spiceandhra

విజయ్ దేవరకొండ న‌టిస్తున్న తాజా చిత్రం డియ‌ర్ కామ్రేడ్. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టిస్తున్నారు. వీరిద్ద‌రు క‌లిసి గీత గోవిందం సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించ‌డంతో ఈ సినిమా పై మ‌రింత ఆస‌క్తి పెరిగింది.

తాజాగా ఈ సినిమా నుంచి మూడో లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు. “గిర గిర గిర తిరగలిలాగా .. తిరిగి అరిగిపోయినా దినుసే నలగాలేదుగా .., అలుపెరుగక తన వెనకాలే అలసి సొలసి పోయినా మనసే కరుగ లేదులే” అంటూ ఈ పాట సాగుతోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం .. రెహ్మాన్ సాహిత్యం ..  గౌతమ్ భరద్వాజ్ – యామినీ ఘంటసాల ఆలాపన మనసుకు హ‌త్తుకునేలా వున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడియస్ సాంగ్స్ లో ఇదొకటని చెప్పొచ్చు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూద్దామా అని ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. జులై 26న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here