Home Actor గుంటూరు న‌గ‌రాన్ని విశ్వ‌న‌గ‌రంగా అభివృద్ధి చేస్తా – గుంటూరు సభల్లో పవన్ కళ్యాణ్‌.

గుంటూరు న‌గ‌రాన్ని విశ్వ‌న‌గ‌రంగా అభివృద్ధి చేస్తా – గుంటూరు సభల్లో పవన్ కళ్యాణ్‌.

72
0


 అభివృద్ది అంటే ఒక్క అమ‌రావ‌తి మాత్ర‌మే కాద‌నీ, గుంటూరు జిల్లాని అమ‌రావ‌తికి దీటుగా అభివృద్ది చేస్తామ‌ని తెలిపారు. సోమ‌వారం జ‌న‌సేన ఎన్నిక‌ల శంఖారావంలో భాగంగా గుంటూరు న‌గ‌రంలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించారు. గుంటూరు ప‌శ్చిమ, తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌ల్లో శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. “గుంటూరు బ‌ల‌మైన పురాత‌న న‌గ‌రం కానీ అభివృద్దికి ఆమ‌డ దూరంలో ఉండిపోయింది.  ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, పేరుకి అమ‌రావ‌తికి కూత‌వేటు దూరంలోనే ఉన్నా, ఇక్క‌డ క‌లరా లాంటి ప్రాణాంత‌క వ్యాధులు ప్ర‌జ‌ల్ని పీడిస్తున్నాయి.

ప్ర‌జ‌ల‌కి పరిశుభ్ర మైన తాగు నీరు అందించే దిక్కు లేదు . మునిసిపల్ వాట‌ర్‌లో డ్రైనేజీ నీరు క‌లిసి వ‌స్తుంది. సింగ‌పూర్ త‌ర‌హా అభివృద్ది అని చెప్పే ముఖ్య‌మంత్రి గుంటూరు న‌గ‌రాన్ని మురికి కూపంలో వ‌దిలేశారు. జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చిన ఏడాది లోపు గుంటూరు న‌గ‌రంలో డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ని పూర్తిగా ప్ర‌క్షాళ‌ణ చేస్తాం. ప్ర‌త్యేక నిధులు కేటాయించి అమ‌రావ‌తికి ధీటుగా గుంటూరుని అభివృద్ది ప‌రుస్తాం. గుంటూరు న‌గరం అభివృద్ది చెంద‌క‌పోవ‌డానికి కార‌ణం ఏళ్ల త‌ర‌బ‌డి పుర‌పాల‌క ఎన్నిక‌లు నిర్వ‌హించ‌క‌పోవ‌డ‌మే. జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్పాటు కాగానే గుంటూరు పుర‌పాల‌క సంస్థ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తాం.

కౌన్సిల‌ర్ల‌ను బ‌య‌టికి ర‌ప్పిస్తాం. గుంటూరు న‌గ‌రానికి ముందుగా కావ‌ల్సింది ప‌రిశుభ్రత క‌లిగిన వాతావ‌ర‌ణం. ఈ రోజుకీ అంత‌ర్గ‌త ర‌హ‌దాలులు ఇరుకుగానే ఉన్నాయి. వీటికి తోడు డ‌బ్బు కావాల‌నుకున్న‌ప్పుడ‌ల్లా డ్రైనేజీల పేరిట గుంత‌లు త‌వ్వేస్తారు. ఇలాంటి ప‌రిస్థితుల్ని రూపుమాపుతాం. ఒక్కసారి ప‌ని చేస్తే 50 సంవ‌త్స‌రాలు చెక్కు చెద‌ర‌ని విధంగా డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ని నిర్మిస్తాం. విదేశాల నుంచి విద్యార్ధులు ఇక్క‌డికి వ‌చ్చి చ‌దువుకునేలా అంత‌ర్జాతీయ స్థాయి సౌక‌ర్యాల‌తో అకడ‌మిక్ ఇనిస్టిట్యూష‌న్స్ ఏర్పాటు చేస్తాం. జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చాక గుంటూరు న‌గ‌రాన్ని విశ్వ‌న‌గ‌రంగా అభివృద్ది చేస్తామ‌ని జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here