Home Actor గుణ 369 ట్రైల‌ర్ రిలీజ్. ఇంత‌కీ ట్రైల‌ర్ టాక్ ఏంటి..?

గుణ 369 ట్రైల‌ర్ రిలీజ్. ఇంత‌కీ ట్రైల‌ర్ టాక్ ఏంటి..?

27
0
గుణ 369 ట్రైల‌ర్ రిలీజ్. ఇంత‌కీ ట్రైల‌ర్ టాక్ ఏంటి..? spiceandhra

ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచ‌ల‌నం సృష్టించి.. యూత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న యువ హీరో కార్తికేయ‌. ఈ సినిమా త‌ర్వాత హిప్పీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చినా.. ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేదు. ఈసారి గుణ 369 అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో కార్తికేయ సరసన ‘అనఘ’ నాయికగా నటిస్తోంది.

ఇటీవ‌ల టీజ‌ర్ & సాంగ్ తో ఆక‌ట్టుకున్న గుణ ఈరోజు ట్రైల‌ర్ ను రిలీజ్ చేసాడు. ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే… గొడ‌వ‌ప‌డితే మిగిలేది ఏం ఉండ‌దు.. గొడ‌వ త‌ప్ప.. అనే మ‌న‌స్త‌త్వం క‌లిగిన యువ‌కుడుకి ప్రేమ‌లో ప‌డిన త‌ర్వాత ఎదురైన స‌మ‌స్య‌లు ఏంటి..?  వాటిని ఎలా ఎదుర్కొన్నాడు..?   గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండాల‌నుకునేవాడు ఎందుకు ఫైట్ చేయాల్సివ‌చ్చింది..?  అనేదే ఈ సినిమా క‌థ అనిపిస్తుంది.

లవ్, యాక్షన్, ఎమోషన్, కామెడీకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఆదిత్య మీనన్ నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రను మంజుభార్గవి పోషిస్తోంది. ఈ ట్రైల‌ర్ ఆడియ‌న్స్ లో ఆస‌క్తిని పెంచుతోంది. మ‌రి.. హిప్పీతో హిట్ సాధించ‌లేక‌పోయిన కార్తికేయ గుణ 369తో స‌క్స‌స్ సాధిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here