ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి.. యూత్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న యువ హీరో కార్తికేయ. ఈ సినిమా తర్వాత హిప్పీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. ఈసారి ఖచ్చితంగా ఆడియన్స్ ని ఆకట్టుకుని విజయం సాధిస్తాను అంటూ గుణ 369 టైటిల్ తో వస్తున్నాడు. ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు.
కార్తికేయ సరసన ‘అనఘ’ నాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ” తొలి పరిచయమా ఇది .. తొలి పరవశమా ఇది .. అలుపెరగని ఆశతో మనసెందుకో నిను చేరమన్నది ” అంటూ ఈ పాట సాగుతోంది. కథానాయిక గురించి కథానాయకుడు మనసులో భావాలకి అక్షర రూపంగా ఈ పాట ఆవిష్కృతమవుతోంది. ఈ పాటకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా శుభం విశ్వనాథ్ సాహిత్యం అందించారు. హరిచరణ్ పాడిన ఈ సాంగ్ కు మంచి స్పందన వస్తుంది.
తిరుమల రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హిప్పీతో హిట్ సాధించలేకపోయిన కార్తికేయ గుణ 369తో సక్సస్ సాధించడం ఖాయం అని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. గుణ ఏం చేస్తాడో చూద్దాం.