Home Actor గుణ 369 ఫ‌స్ట్ లుక్ రిలీజ్..!

గుణ 369 ఫ‌స్ట్ లుక్ రిలీజ్..!

77
0

ఆర్ఎక్స్ 100 సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ హీరో కార్తికేయ‌. ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో కార్తికేయ త‌దుప‌రి చిత్రం గురించి ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.  వైధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటున్న కార్తికేయ ఒక వైపు హిప్పీ సినిమా చేస్తూ, మరో వైపున గుణ 369 సినిమా చేస్తున్నారు. హిప్పీ సినిమా జూన్ 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఈరోజు గుణ 369 ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. రెడ్ కలర్ షర్ట్ తో .. లుంగీ పైకెత్తి కట్టి .. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని స్టైల్ గా కార్తికేయ కనిపిస్తున్నాడు.

ఈ లుక్ లో ఆయన మరింత అందంగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా పై ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తోన్నారు.  ఈ సినిమాను, తిరుమల రెడ్డి – అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ మూవీ త‌న‌కి విజ‌యాన్ని అందిస్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాడు కార్తికేయ‌. మ‌రి…ఆశించిన విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here