Home Telugu గూఢ‌చారి ఎంత వ‌ర‌కు వ‌చ్చాడు..?

గూఢ‌చారి ఎంత వ‌ర‌కు వ‌చ్చాడు..?

108
0

చిన్న సినిమాగా రూపొందిన క్ష‌ణం సినిమాతో పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకున్న యువ న‌టుడు అడ‌వి శేష్. ప్ర‌స్తుతం అడ‌వి శేష్ గూఢ‌చారి అనే టైటిల్ తో ఓ వైవిధ్య‌మైన సినిమా చేస్తున్నాడు. విభిన్న‌ క‌ధాంశంతో రూపొందుతోన్నఈ స్పై థ్రిల్లర్ లో అడ‌వి శేష్ కి జోడీగా శోభిత ధూళిపాళ్ల నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ .. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూత‌న ద‌ర్శ‌కుడు శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

గ‌త కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు అమెరికాలో జరిగింది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. ఇక లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే…అమెరికా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని… ప్ర‌స్తుతం హిమాచల్ ప్రదేశ్ లో షూటింగ్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఎం.ఎల్.ఎ సినిమాతో విజ‌యం సాధించిన పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ అధినేత టి.జి విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాతో మ‌రో విజ‌యం సాధించ‌డం ఖాయం అని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు.

గూఢ‌చారి పోస్ట‌ర్స్ ఇంట్ర‌స్టింగ్ గా…ఇన్నోవేటివ్ గా..ఉండ‌డంతో సినిమాలో ఏదో విష‌యం ఉంద‌నిపిస్తోంది. దీంతో గూఢ‌చారి…క్ష‌ణం వ‌లే చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజ‌యాన్ని ఖ‌చ్చితంగా సాధిస్తుంద‌నే టాక్ వినిపిస్తోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. మ‌రి.. అడ‌వి శేష్ గూఢ‌చారిగా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంటాడ‌ని ఆశిద్దాం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here