Home Actor గేమ్ ఓవ‌ర్ రివ్యూ..!

గేమ్ ఓవ‌ర్ రివ్యూ..!

266
0

ఝుమ్మందినాదం సినిమాతో తెలుగు తెర‌కు పరిచయమై..తొలి ప్ర‌య‌త్నంలోనే ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న క‌థానాయిక తాప్సి. మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్, గుండెల్లో గోదారి, సాహ‌సం, ముని 3, ఆనందో బ్ర‌హ్మ‌…ఇలా  విభిన్న క‌థా చిత్రాల‌ను ఎంచుకుంటూ హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకుంది. తాజాగా తాప్సి అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో గేమ్ ఓవ‌ర్ అనే సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ లో న‌టించింది. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన గేమ్ ఓవ‌ర్ తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో రూపొందింది. ఈ రోజు (జూన్ 14) గేమ్ ఓవ‌ర్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి..గేమ్ ఓవ‌ర్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా..?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

– స్వ‌ప్న (తాప్సి) వీడియో గేమ్ డిజైన‌ర్. ఆమె జీవితంలో డిసెంబ‌ర్ 31న జ‌రిగిన ఓ సంఘ‌ట‌న వ‌ల‌న మాన‌సికంగా ఇబ్బంది ప‌డుతుంటుంది. అందుచేత డిసెంబ‌ర్ నెల వ‌చ్చిందంటే చాలు ఆమెలో టెన్ష‌న్ స్టార్ట్ అవుతుంది. మ‌రీ..ముఖ్యంగా చీక‌టి అంటే చాలా భ‌యం. అందుకే ఎప్పుడూ వెలుతురులోనే ఉండాల‌నుకుంటుంది. ఇదిలా ఉంటే..అమృత (సంచ‌న న‌ట‌రాజ‌న్) అనే అమ్మాయిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తి కిరాత‌కంగా చంపేస్తాడు. అమృత‌కు, స్వ‌ప్న‌కు సంబంధం ఏంటి..? స‌్వ‌ప్న జీవితంలో జ‌రిగిన ఆ..సంఘ‌ట‌న ఏంటి..?  చీక‌టి అంటే భ‌య‌ప‌డుతూ..మాన‌సికంగా ఇబ్బందులు ప‌డే స్వ‌ప్న త‌న స‌మ‌స్య‌ల నుంచి ఎలా భ‌య‌ప‌డింది అనేదే మిగిలిన క‌థ‌.

విశ్లేష –  స్వ‌ప్న పాత్ర‌లో తాప్సి ఎమోష‌న్, యాక్ష‌న్…ఇలా అన్నింటిలో పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా అద్భుతంగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. అలాగే క‌ల‌మ్మ పాత్ర‌లో వినోదిని వైద్య‌నాథ్ కూడా చాలా బాగా న‌టించింది. జీవితంలో ఎలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగినా త‌ట్టుకుని నిల‌బ‌డాలి.. పోరాడాలి అనే విష‌యాన్ని ద‌ర్శ‌కుడు అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ చెప్పారు. దీనిని సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ గా చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. అయితే..ఫ‌స్టాఫ్ అంతా చాలా స్లోగా ఉన్న‌ట్టు అనిపిస్తుంది. క‌థ ముందుకు వెళ్ల‌దు. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ అయినా..ఇంట్ర‌స్టింగ్ ఉంటుంది అనుకుంటే…చాలా సింపుల్ గా చూపించాడు. ఇక సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే…థ్రిల్లింగ్ మూమెంట్స్ తో చాలా ఇంట్ర‌స్ట్ గా చూసేలా గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లేతో ఉంటుంది.

అయితే…ఇంకా ఏదో ఉంటుంది అనుకునే లోపు సినిమా అయిపోతుంది. సెకండాఫ్ లో వ‌చ్చే కొన్ని సీన్స్  క‌ల‌లో జ‌రిగిన‌ట్టు చూపించారు. ఆత‌ర్వాత జ‌రిగింది క‌లా..?  నిజ‌మా.? అస‌లు..  ఏది క‌ల‌..?  ఏది నిజం అనే క‌న్ ఫ్యూజ‌న్ ఉంటుంది. సినిమా చూసే ప్రేక్ష‌కుల్లో అన్నిర‌కాల వాళ్లు ఉంటారు. అందుచేత ఏం చెప్పినా క్లియ‌ర్ గా చెబితేనే సినిమా స‌క్స‌స్ అవుతుంది. అలా..కాకుండా ద‌ర్శ‌కుడు తెలివితేట‌ల‌ను చూపించి క‌న్ ఫ్యూజ్ అయ్యేలా తీస్తే…సామాన్య ప్రేక్ష‌కుడికి అర్ధం కాక బాగోలేదు అని చెప్పే ప్ర‌మాదం ఉంది. అందుచేత మంచి పాయింట్ ని ఎంచుకున్న‌ప్ప‌టికి ఆడియ‌న్ కి క‌న్ ఫ్యూజ్ చేయ‌డం వ‌ల‌న‌..కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చూపించ‌క‌పోవ‌డం వ‌ల‌న గేమ్ ఓవ‌ర్ అంద‌రికీ కాకుండా..కొంత మందికి మాత్ర‌మే న‌చ్చుతుంది.

రేటింగ్ – 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here