Home Actor గోపీచంద్ చాణ‌క్య ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్..!

గోపీచంద్ చాణ‌క్య ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్..!

62
0

గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం చాణక్య. గోపీచంద్ స‌ర‌స‌న‌ మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో జరీన్ ఖాన్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. వైవిధ్యమైన క‌థాంశంతో రూపొందుతోన్న‌ ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. అయితే…ఈ రోజు గోపీచంద్ పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా చాణ‌క్య చిత్ర యూనిట్  చాణక్య సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.

ముస్లింలు ఎక్కువుగా ఉన్న వీధిలో తీక్ష‌ణంగా చూస్తున్న గోపీచంద్ లుక్..చాలా ఇంట్ర‌స్టింగ్ ఉంది. ఈ పోస్ట‌ర్ ఈ సినిమా పై ఆస‌క్తిని పెంచుతుంది. ఇటీవ‌ల త‌న సినిమాలు ఫ్లాప్ అవ్వ‌డంతో కెరీర్ లో వెన‌క‌బ‌డిన గోపీచంద్ ఈ సినిమా పై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని ఏ కే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ స్వరాలూ సమకూరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here