Home Actor గ్యాంగ్ లీడ‌ర్ టీజ‌ర్ విడుద‌ల‌కు ముహుర్తం ఖ‌రారు.

గ్యాంగ్ లీడ‌ర్ టీజ‌ర్ విడుద‌ల‌కు ముహుర్తం ఖ‌రారు.

54
0
గ్యాంగ్ లీడ‌ర్ టీజ‌ర్ విడుద‌ల‌కు ముహుర్తం ఖ‌రారు. spiceandhra

నేచురల్‌ స్టార్‌ నాని వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను జూలై 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అలాగే ‘రారా.. జగతిని జయించుదాం…’ అంటూ సాగే ఈ సినిమా ఫస్ట్‌ సాంగ్‌కి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన మ్యూజిక్‌ మెస్మరైజింగ్‌గా ఉంది.

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌, మాటలు: వెంకీ, డార్లింగ్‌ స్వామి, రచనా సహకారం: ముకుంద్‌ పాండే, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవన్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: రామ్‌కుమార్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: ఉత్తర మీనన్‌, స్టిల్స్‌: జి.నారాయణరావు, కో-డైరెక్టర్‌: కె.సదాశివరావు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: శేషు, సి.ఇ.ఓ.: చిరంజీవి(చెర్రీ), నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సివిఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here