Home Actor గ్యాంగ్ లీడ‌ర్ ప్రీ లుక్ రెడీ..!

గ్యాంగ్ లీడ‌ర్ ప్రీ లుక్ రెడీ..!

37
0
గ్యాంగ్ లీడ‌ర్ ప్రీ లుక్ రెడీ..! spiceandhra

నేచుర‌ల్ స్టార్ నాని – మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న చిత్రం గ్యాంగ్ లీడ‌ర్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. యువ సంగీత సంచ‌ల‌నం అనిరుథ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో  ఒక ప్రధాన పాత్ర ఆర్ఎక్స్ 100 ఫేమ్  కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ వాయిదా ప‌డింది అంటూ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దీంతో గ్యాంగ్ లీడ‌ర్ రిలీజ్ వాయిదా ప‌డ‌డం లేదు. చెప్పిన‌ట్గుగా ఆగ‌ష్టు 30న రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు చిత్ర నిర్మాత‌లు. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… నాని ఈ సినిమా గురించి ట్విట్ట‌ర్ లో స్పందించారు. ఇంత‌కీ నాని ఏం చెప్పారంటే… డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కానీ.. మైత్రీ మూవీ మేక‌ర్స్ కానీ.. సోష‌ల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టాలంటే చాలా భ‌య‌ప‌డిపోతున్నారు. మీరు (నెటిజ‌న్లు) గ్యాంగ్ లీడ‌ర్ గురించి అప్ డేట్స్ అడ‌గ‌డం వ‌ల‌న‌.

భ‌య‌ప‌డిపోతున్నారు అన‌డం కంటే.. మీరు భ‌య‌పెట్టారు అన‌డం క‌రెక్టేమో. ఒక రకంగా చెప్పాలంటే.. చాలా మంచి ప‌ని చేసారు. ఈ సినిమాకి ఏదోటి రిలీజ్ చేసి కొంత గ్యాప్ ఇచ్చి.. ఆత‌ర్వాత ఇంకొటి రిలీజ్ చేసి గ్యాప్ ఇచ్చి.. అలా చేయ‌కూడ‌దు అనుకున్నాం. ఒక‌సారి మ్యూజిక్ స్టార్ట్ అయ్యిందంటే అది రిలీజ్ దాకా విన‌ప‌డాలి అనుకున్నాం. మేం రెడీగా ఉన్నాం. మీరు రెడీనా..?   జులై 13 అంటే రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు గ్యాంగ్ లీడ‌ర్ ప్రీ లుక్ బ‌య‌ట‌కు రాబోతుంది. అందులో మిగ‌తా పొగ్రామ్ డీటైల్స్ అన్నీ ఉండ‌బోతున్నాయ్. రెడీ..స్టార్ట్ మ్యూజిక్.. అంటూ త‌న‌దైన శైలిలో ఈ డీటైల్స్ తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here