Home Actor గ్యాంగ్ లీడ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేది ఎప్పుడు..?

గ్యాంగ్ లీడ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేది ఎప్పుడు..?

102
0
గ్యాంగ్ లీడ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేది ఎప్పుడు..? spiceandhra

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా మ‌నం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న‌ ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే.. అదే రోజున ప్ర‌భాస్ సాహో చిత్రం రిలీజ్ అవుతుండ‌డంతో గ్యాంగ్ లీడ‌ర్  మూవీ రిలీజ్ ను వాయిదా వేసారు.

ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20వ తేదీకి రిలీజ్ చేయ‌నున్నారు అనే టాక్ వచ్చింది కానీ.. అంతకి ఒక వారం ముందుగానే ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. సెప్టెంబర్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ మూవీ డేట్ ను అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ప్రతినాయకుడిగా న‌టిస్తున్న‌ ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here