Home Political News గ‌వ‌ర్న‌ర్ తో ప్ర‌జా కూట‌మి నేత‌లు భేటీ.!

గ‌వ‌ర్న‌ర్ తో ప్ర‌జా కూట‌మి నేత‌లు భేటీ.!

115
0

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తో ప్ర‌జాకూట‌మి నేత‌లు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ఎల్.ర‌మ‌ణ‌,కోదండ‌రామ్, జానారెడ్డి, మ‌ధుయాష్కీ, అజారుద్ధీన్, పొన్నాల ల‌క్ష్మ‌య్య భేటీ అయ్యారు.అనంత‌రం టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఎవ‌ర్నిఆహ్వానించాలి అనే విష‌యంలో కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయ‌ని..ఎన్నిక‌ల ముందు కూట‌మిగాఏర్ప‌డిన పార్టీల‌కు అధిక సీట్లు వ‌స్తే కూట‌మినే గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానించాల‌ని అన్నారు.

కొన్ని పార్టీలు ఎన్నిక‌ల త‌ర్వాత కూట‌మిగా ఏర్ప‌డే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని ఫ‌లితాల ప్ర‌క‌ట‌న త‌ర్వాత గెలిచిన అభ్య‌ర్ధుల‌కు స‌రైన‌ ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరిన‌ట్టు చెప్పారు. టీటీడీపీ అధ్య‌క్షుడు ఎల్.ర‌మ‌ణ మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ నిరంకుశ ధోర‌ణి గురించి గ‌వ‌ర్న‌ర్ కు మ‌రోసారి వివ‌రించామ‌ని చెప్పారు. కూట‌మికి సంపూర్ణ మెజార్టీ వ‌స్తుంద‌ని కోదండ‌రామ్ అన్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here