Home Movie News చందు త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

చందు త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?

84
0

కార్తికేయ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..తొలి చిత్రంతోనే విజ‌యం సాధించి అంద‌రి దృష్టి ఆక‌ర్షించిన యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి. కార్తికేయ త‌ర్వాత ప్రేమ‌మ్ చిత్రంతో మ‌రో స‌క్స‌స్ సొంతం చేసుకున్న చందు తాజాగా స‌వ్య‌సాచి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. యువ‌స‌మ్రాట్ అక్కినేని నాగ చైత‌న్యతో తెర‌కెక్కించిన స‌వ్య‌సాచి చిత్రం న‌వంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీ సాంగ్స్, టీజ‌ర్ & ట్రైల‌ర్ విశేషంగా ఆక‌ట్టుకోవ‌డంతో ఈ మూవీ పై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన డైరెక్ట‌ర్ చందు మొండేటి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలియ‌చేసాడు. త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో అని అడిగితే…నాగార్జున గారి కోసం ఓ స్ర్కిప్ట్ రెడీ చేసాన‌న్నారు. అలాగే కార్తికేయ 2కి సంబంధించి 15 నిమిషాల స్టోరీ ఉంది. దీనిని ఫుల్ స్ర్కిప్ట్ గా మార్చాలి. అలా చేయాలంటే కొంత టైమ్ ప‌డుతుంద‌న్నాడు. అస‌లు చైత‌న్య‌తో సినిమా చేద్దామ‌ని ప్రేమ‌మ్ కంటే ముందుగా క‌లిసి చాణ‌క్య అనే క‌థ చెప్పాడ‌ట‌.

ఆ క‌థ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంద‌ట కానీ…ఆ సినిమా చేద్దాం అనుకుంటే ప్రేమ‌మ్ చేయాల్సి వ‌చ్చింది. ఆత‌ర్వాత స‌వ్య‌సాచి చేసాను. ఆ క‌థ ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తుందో..? ఎవ‌రితో చేస్తానో చెప్ప‌లేన‌న్నాడు. అంతా బాగానే ఉంది నెక్ట్స్ మూవీ ఎవ‌రితో అంటే..ఏదైనా స‌వ్య‌సాచి సినిమా రిలీజ్ త‌ర్వాతే తెలుస్తుంది అన్నాడు. మ‌రి…చందు త‌దుప‌రి చిత్రాన్ని నాగార్జున‌తో చేస్తాడో..?   లేక నిఖిల్ తో కార్తికేయ 2 చేస్తాడో…  ఈ రెండూ కాకుండా మ‌రో హీరోతో సినిమా చేస్తాడో తెలియాలంటే స‌వ్య‌సాచి రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here