Home News చంద్రబాబు నన్నే ఫాలో అవుతున్నారు – కే ఏ పాల్

చంద్రబాబు నన్నే ఫాలో అవుతున్నారు – కే ఏ పాల్

86
0

సంచలన కామెంట్లకు ప్రజాశాంతి పార్టీ  అధ్యక్షులు కే ఏ పాల్ కేంద్రంగా మారారు. ఈ సారి ఎన్నికల్లో ఆయన చేసినంత కామెడీ మరెవరు చేసి ఉండరు. ఆయన కనిపిస్తే చాలు మీడియా ఛానల్స్ ఆయన వెంట పరుగులు తీస్తున్నాయి. ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న పాల్…..ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరో అనే అనుకోవాలి. తాజాగా కే ఏ పాల్ కేంద్ర ఎన్నికల సంఘం మీద విరుచుకు పడ్డారు. ఓటింగ్ యంత్రాల వాడకం అస్సలు బాగోలేదని తేల్చి చెప్పారు.

 సోమవారం ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను ట్యాపరింగ్ చేసే అవకాశం ఉందన్నారు. బీజేపీకి ఏపీలో బలం లేదని వైసీపీని గెలిపించాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశ, రాష్ట్ర పరిస్థితి ఘోరంగా ఉందని పదేపదే చెబుతున్నా ఏ పార్టీ నేతలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ మాత్రమే స్పందించారని చెప్పారు.మే 23 వరకు ప్రతిపక్షాలు ఏమి చేయలేక పోతే ప్రధాని మోదీ దేశాన్ని నాశనం చేస్తారని పాల్ హెచ్చరించారు. ఈవీఎంలకు పరిష్కారం చూపకపోతే ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

అసలు ఈ విషయం మీద మొదట నుంచీ పోరాడుతున్నది తానే అని కే ఏ పాల్ వెల్లడించారు. ఇప్పుడిప్పుడే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర నాయకులు తన బాటలోకి వస్తున్నారని ఆయన వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here