Home News చంద్ర‌బాబు ఓ వ‌ర్గం వారికి మాత్ర‌మే ప్ర‌యోజ‌నం క‌ల్పించారు – జగన్‌

చంద్ర‌బాబు ఓ వ‌ర్గం వారికి మాత్ర‌మే ప్ర‌యోజ‌నం క‌ల్పించారు – జగన్‌

70
0

ఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్-2019లో జాతీయ రాజకీయాలతో పాటు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పై జగన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ మీరు ఏపీ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు..? వైఎస్సార్‌ సంక్షేమ రాజ్యానికి, మీ పరిపాలనకు తేడా ఎలా ఉంటుంది..? అని ప్రశ్నించారు. దీనికి జగన్ జవాబిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ వర్గం వారికి మాత్రమే ప్రయోజనం కల్పించారని విమర్శించారు.

గత ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. మాకు వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, పవన్‌ కల్యాణ్‌ కలిసి పోటీ చేసినా.. తాము కేవలం ఒక్క శాతం ఓట్లతో ఓడిపోయాం. జాతీయ రాజకీయాలకు సంబంధించినంతవరకు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయి. అందుకే జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతానికి తటస్థ వైఖరిని అవలంబిస్తున్నాం. మాకు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా అత్యంత ముఖ్యం. వాటిని నెరవేర్చే పార్టీకే ఎన్నికల తర్వాత మద్దతు ఇస్తాం.

పాదయాత్ర ద్వారా 14 నెలలు ప్రజల మధ్యలో ఉన్నాను. పాదయాత్ర పొడుగుతా ప్రజల కష్టసుఖాలు వింటూ.. వారి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? అన్నది క్షుణ్ణంగా తెలుసుకున్నాను. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒక భరోసాను ఇచ్చాను. ప్రజలకు సంక్షేమ పాలన అందించాలన్నది నా లక్ష్యం. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి.. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేవిధంగా నిర్ణయాలు తీసుకుంటాం.

 మేం ప్రకటించిన నవరత్నాల పథకంతో సమాజంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుంది.  తొమ్మిదేళ్ల రాజకీయ ప్రయాణం అంతా ప్రజల మధ్యలోనే గడిచింది. ఏ దారిలో నడుస్తున్నా.. ఎక్కడ ఉంటున్నా ఉన్నది ప్రజలకు సమాచారం ఇస్తూ.. వారితో కలిసి నడిచాను. వీలైనంత ఎక్కువ మంది ప్రజలను కలుసుకున్నాను అని తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here