Home Political News చంద్ర‌బాబు చీక‌టి రాజ‌కీయాలు మానుకోవాలి – ఎంపీ బాల్క సుమ‌న్.

చంద్ర‌బాబు చీక‌టి రాజ‌కీయాలు మానుకోవాలి – ఎంపీ బాల్క సుమ‌న్.

103
0

టిఆర్ఎస్ నేత, ఎంపీ బాల్కసుమన్‌…ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో సీనియర్ నేత గట్టు రామచంద్రరావుతో కలసి ఈ రోజు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.  సీఎం చంద్ర‌బాబు న‌క్క జిత్తుల కుట్ర‌లు మ‌ళ్లీ మొద‌లుపెట్టారు. వంద‌ల కోట్లు తెలంగాణ‌కు త‌ర‌లించారని.. తెలంగాణ‌ను క‌లుషితం చేసేందుకు ఏపీ ఇంటిలిజెన్స్ వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ అధికారులను వెంటనే ఏపీకి పంపేయాలని డీజీపీ, రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

వేరే రాష్ట్రాల ఇంటిలిజెన్స్ పోలీసులు తెలంగాణ‌లో ఎందుకు తిరుగుతున్నార‌ని ప్ర‌శ్నించారు. డీజీపీ, గ‌వ‌ర్న‌ర్ లు  చ‌ర్య‌లు తీసుకోవాలి. ఈసీకి ఫిర్యాదు చేస్తాం. లేదంటే మేమే రంగంలోకి దిగుతాం. చంద్ర‌బాబు చీక‌టి రాజ‌కీయాలు మానుకోవాలన్నారు. మహారాష్ట్ర పోలీసులు బాబుపై కేసు నమోదుచేస్తే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించాలని సుమన్ ప్రశ్నించారు. ఓటేసిన గెలిపించిన ఏపీ ప్రజలకు సేవ చేసుకోవాలని సుమన్ సూచించారు. ఆంధ్రా ప్రజల సొమ్ముతో వేతనాలు తీసుకుంటున్న పోలీసులు వారి కోసం పనిచేస్తే బాగుంటుందని చురకలు అంటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here