Home News చంద్ర‌బాబు డ్రామాలు ఆడుతున్నాడు – వై.సీ.పీ నేత‌ పేర్నినాని.

చంద్ర‌బాబు డ్రామాలు ఆడుతున్నాడు – వై.సీ.పీ నేత‌ పేర్నినాని.

110
0

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి  పేర్నినాని మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ…చంద్రబాబు చేసే మోసాన్ని కూడా ఆకాశాన్ని ఎత్తే మీడియాను చూస్తుంటే భయం వేస్తోంది. చంద్రబాబు మరోసారి కాపులను మోసం చేయడానికి తెరలేపారు.2014లో తన అధికారం కోసం కాపుల్ని బిసిలలో చేరుస్తానని వాగ్దానం చేశారు. ముద్రగడ పద్మనాభం రోడ్డేక్కేవరకు కూడా కాపులను మరిచిపోయారు. ఆ తర్వాత చంద్రబాబుకు కాపు రిజర్వేషన్లు గుర్తుకువచ్చాయి. మంజునాధ కమీషన్ ను వేసి ముగిద్దామని చూశారు. జస్టిస్ మంజనాధ రిపోర్ట్ ఇవ్వకుండానే వారి సభ్యులతో రిపోర్ట్ తీసుకుని కాపులను బిసిలలో చేరుస్తన్నట్లు అసెంబ్లీలో ప్రకటన చేశారు.

13 జిల్లాల్లోని కాపు సోదరులు అందరి నోట్లలో స్వీట్లు తినిపించి మీరు బిసిలయ్యారంటూ  సంబరాలు చేసి మోసం చేశారు. అప్పటినుంచి ఈరోజు వరకు కాపులు బిసి సర్టిఫికేట్లు తెచ్చుకునే పరిస్దితి ఉందా? ఎంఆర్ ఓ కార్యాలయాల్లో బిసి ఎఫ్ సర్టిఫికేట్  అడిగితే ఎంఆర్ ఓలు కాపులను ఎగతాళి చేసే పరిస్దితి. అసలు కాపులను ఎన్నిసార్లు బిసిలను చేస్తారు.గతంలో అసెంబ్లీలో చేసింది ఏంటి?నేడు అసెంబ్లీలో చేసింది ఏంటి?చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు ఇవి కావా? అని ప్ర‌శ్నించారు.

గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం అన్నారంట ఓ పెద్దాయన. అదే రీతిలో ప్రధాని నరేంద్రమోది ఆర్థికంగా వెనకబడిన వారికి పది శాతం రిజర్వేషన్లు ఇస్తే వాటిలో ఐదు శాతం ఇస్తున్నామంటూ చంద్రబాబు ప్రకటించారు. ఇది మోసపూరితం. ఈబిసిలలో కాపులకు సగం అంటూ మరో మోసానికి పాల్పడ్డారు. బిసి వర్గాలందరితో కాపులకు తగాదా పెట్టారు. ఈరోజు ఆర్ధికంగా వెనకబడిన అగ్ర వర్ణపేదలతో కూడా తగాదాలు పెట్టే పరిస్దితి చంద్రబాబు తెచ్చారు. కాపులను ఏకాకి చేసే కుట్ర చేస్తున్నారు. కాపులను మొన్న బిసిలను చేశామని చెప్పారు.నేడు ఈబిసిలను చేశామని అంటున్నారు.

కాపులు బిసిలా ?ఈబిసిలా మీరు ఏ కేటగిరిలో చేర్చారు చంద్రబాబు సమాధానం చెప్పండి.దళిత క్రైస్తవులందరిని ఎస్సీలను చేసేశామని నిన్న అసెంబ్లీలో ప్రకటన చేశారు. కాపులకు లాగా వారికి కూడా స్వీట్లు తినిపిస్తారేమో. గతంలో ఎస్సీ వర్గీకరణపేరుతో ఎస్సీలలో చిచ్చురేపి ఆ వేడిలో చలి కాసుకున్న వ్యక్తి చంద్రబాబు. దళిత క్ర్లైస్తవుల గురించి కేంద్రంతో కనీసం ఒక్కమాటైనా మాట్లాడారా? అని ప్ర‌శ్నించారు. తునిలో రైలు తగులబెట్టారని,రాజధానిలో తోటలు తగులపెట్టారు.పోలవరంను అడ్డుకుంటున్నారు. విశాఖలో సమిట్లు పెడితే క్యాండిల్ ర్యాలీలు పెట్టి పెట్టుబడిదారులను భయభ్రాంతులను చేశారు అని వైయస్ జగన్ పై చంద్రబాబు అసెంబ్లీలో నిందలు వేశారు.

మీ నిందారోపణలు దగాకోరు కుట్రలు విషయంలో మీ ఆధీనంలో ఉండే పోలీసులు వారు చేసిన దర్యాప్తులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టినేతల పైగాని జగన్ పై గాని ఎందుకు వాటిని నిరూపించలేకపోయారు అన్నారు. ప్రత్యేక హోదా అంటే జైలులో వేస్తామని మీరంటే అయినప్పటికి హోదా కోసం పోరాటం చేసింది ఎవరు వైయస్ జగన్ కాదా? అని అడిగారు. క్యాండిల్ ర్యాలీలే వద్దని చెప్పిన నీ చేత ఇటీవల విజయవాడలో కాగడాలు పట్టించింది వైయస్ జగన్ మాత్రమే. అసెంబ్లీలో ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజి చాలు అన్ని మీ చేత అదే అసెంబ్లీలోనే ప్రత్యేకహోదా కావాలని నల్లబ్యాడ్జిలు ధరించేలా చేసింది వైయస్ జగన్ మాత్రమే. ఓట్ల పండుగ వస్తుందంటే చంద్రబాబు వందల మోసాలకు తయారవుతాడు.

తక్కువధరకే గృహోపకరణాలు ఇస్తారని చెప్పి మన ప్రజలను మోసం చేసిన తమిళనాడుకు చెందిన మోసగాడి నైజమే చంద్రబాబుది. ఓట్లు వస్తాయని ఏదైనా ఇంటిలిజెన్స్ చెబితే చాలు వాటికి శంఖుస్ధాప‌న‌ చేస్తారు.బడ్జెట్ లో ఏమాత్రం నిధులు కేటాయించకపోయినా వాటని ప్రారంబిస్తానికి బయల్దేరతాడు.కడప ఉక్కుఫ్యాక్టరీ,బందర్ పోర్టుల విషయంలో చేస్తుంది అదే అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here