Home News చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం వ‌ల‌న ఓడిపోయామ‌నుకోవ‌డం లేదు – టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం వ‌ల‌న ఓడిపోయామ‌నుకోవ‌డం లేదు – టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి

92
0

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఓట‌మి గురించి టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం వ‌ల‌న ఓడిపోయామ‌ని అనుకోవ‌డం లేద‌ని… మ‌రి కొంత ముందుగా పొత్తులు ఖ‌రారు అయ్యుంటే బాగుండేద‌ని అన్నారు. కూట‌మి కొన‌సాగింపు పై త్వ‌ర‌లో కుంతియాతో చ‌ర్చిస్తామ‌న్నారు. ఓట‌మి పై రెండు మూడు రోజుల్లో స‌మీక్ష చేసి తెలియ‌చేస్తామ‌న్నారు. వీవీ ప్యాడ్‌ స్లిప్పులు లెక్కపెట్టాలని కోర్టుకు వెళ్తుంటే రిటర్నింగ్ అధికారులు స్లిప్పులను తీసేస్తుంటే వ్యవస్థను ఏమనాలన్నారు.  1% తేడా ఉన్న ధర్మపురి, కోదాడ, ఇబ్రహీంపట్నంలో ఎందుకు వీవీ ప్యాడ్ స్లిప్స్ లెక్కపెట్టలేదని ప్రశ్నించారు.

ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. సాయంత్రం 4 తర్వాత మంచిర్యాలలో వేల సంఖ్యలో ఓట్లు పోల్ అయ్యాయని, పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రెంట్ గురించి తానేమీ మాట్లాడనని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మెరుగైన ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానానికి ప్రాథమిక నివేదిక ఇచ్చామని చెప్పారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారమే కాలేదని, ఇంకా సీఎల్పీ ఎన్నిక ఎప్పుడో చూడాలని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here