Home Actor చంద్ర‌బాబు పై మోహ‌న్ బాబు ఆగ్ర‌హాం – వేడెక్కుతోన్న ఏపీ రాజ‌కీయం.!

చంద్ర‌బాబు పై మోహ‌న్ బాబు ఆగ్ర‌హాం – వేడెక్కుతోన్న ఏపీ రాజ‌కీయం.!

85
0


శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలకు స్కాలర్‌షిప్ బకాయిల పై గతంలో చంద్రబాబు ప్రభుత్వం పై బహిరంగ విమర్శలు చేసిన ప్రముఖ సినీనటుడు, విద్యానికేతన్ సంస్థల ఛైర్మన్ మోహన్‌బాబు ఇప్పుడు ప్రత్యక్షంగా ఆందోళన చేసారు. తన సంస్థలోని విద్యార్థులతో కలిసి స్కాలర్‌షిప్ సమస్యల పై నేడు ర్యాలీ నిర్వహించి, తమ నిరసనను తెలియ‌చేసారు. అయితే… ఎన్నికల వేళ ర్యాలీలు, బహిరంగ నిరసనలకు అనుమతులు ఇవ్వవ‌ని, ముందు జాగ్రత్తగా మోహన్ బాబుతో పాటు విద్యాసంస్థకు చెందిన మరికొంత మంది కీలక సభ్యులను పోలీసులు గృహ నిర్భందం చేసారు.

తనను హౌస్ అరెస్ట్ చేయడం పై స్పందించిన మోహన్ బాబు… ఎట్టిపరిస్థితిలోను నిరసన ర్యాలీని కొనసాగిస్తానంటూ ప్రకటించారు.అసలే ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుతున్న వేళ… ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి అవకాశాల కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తున్న రాజకీయ పక్షాలు ఈ పరిస్థితి పై ఎలా స్పందిస్తారో చూడాలి. వైఎస్ కుటుంబంతో ఉన్న బంధుత్వం, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశం రాజకీయ రంగు పులుముకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

అయితే…తిరుపతిలో వందలాది మంది విద్యార్థులు, తన కుమారులు విష్ణు, మనోజ్ లతో కలిసి కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బైఠాయించిన మోహ‌న్ బాబు మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు సర్కారు ఆడుకుంటోందని ఆరోపించిన ఆయన, కళాశాలల యాజమాన్యాలకు కట్టాల్సిన డబ్బును ప్రభుత్వం రకరకాలుగా మళ్లిస్తోందని ఆరోపించారు. నారా చంద్రబాబునాయుడుకు పసుపు కుంకుమ పథకం నాలుగు సంవత్సరాల క్రితం ఎందుకు గుర్తుకు రాలేదని, కేవలం మూడు నెలలకు ముందే ఎందుకు గుర్తుకు వచ్చిందని నటుడు మోహన్ బాబు ప్రశ్నించారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here