Home News Political News చంద్ర‌బాబు 21 లోపు కోర్టుకు రాకుంటే..అరెస్ట్ చేస్తాం – నాందేడ్ ఎస్పీ క‌తార్.

చంద్ర‌బాబు 21 లోపు కోర్టుకు రాకుంటే..అరెస్ట్ చేస్తాం – నాందేడ్ ఎస్పీ క‌తార్.

7
0
chandrababu-naidu1536865263

బాబ్లీ ప్రాజెక్టు వద్ద జరిగిన ఘర్షణల పై నిందితులను 8 ఏళ్ల‌ నుంచి విచారించలేదని వస్తున్న ఆరోపణల పై నాందేడ్ ఎస్పీ కతార్ స్పందించారు. ఈరోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…బాబ్లీ ప్రాజెక్ట్ కేసులో 5 ఏళ్ల క్రితం ఛార్జీషీట్ దాఖ‌లు చేసాం. పోలీసులు, ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను అడ్డుకున్నందుకు కేసు న‌మోదు చేసారన్నారు. 16 మంది పై ఛార్జీషీట్ వేసాం. ఛార్జీషీట్ వేసాకా కేసు పూర్తిగా కోర్టు ప‌రిధిలో ఉంటుంది. 21 లోపు కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌మ‌ని ధ‌ర్మాబాద్ కోర్టు మాకు ఆదేశాలు జారీ చేసింది.

నాన్ బెయిల‌బుల్ వారెంట్ ఇవ్వ‌డం పై కోర్టుకే విచ‌క్ష‌ణాధికారం ఉంటుందని… 21 లోపు నిందితులు వచ్చి హాజరవుతారనే భావిస్తున్నామని తెలిపారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం కోర్టు విచక్షణాధికారమని చెప్పిన ఆయన, చంద్రబాబు సహా ఇతర నిందితులు కోర్టుకు రాకుంటే, న్యాయ నిపుణుల సలహా తీసుకుని, వారిని అరెస్ట్ చేసి తరలిస్తామని చెప్పారు.

ఇదిలా ఉంటే…ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ లో టీటీడీపీ అత్య‌వ‌స‌ర స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో చంద్ర‌బాబాకు నాన్ బెయిల‌బుల్ వారెంట్ పై చ‌ర్చ జ‌రిగింది. అనంత‌రం చంద్ర‌బాబుకు నాన్ బెయిల‌బుల్ వారెంట్ రావడానికి నిర‌స‌న‌గా హైద‌రాబాద్ క‌లెక్ట‌రేట్ ముందు టీటీడీపీ నేత‌లు ధ‌ర్నా చేసారు. కేసీఆర్ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేసిన టీటీడీపీ నేత‌లు…చంద్ర‌బాబుకు నోటీసులు రావ‌డం వెన‌క కుట్ర ఉంద‌ని ఆరోపించారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here