Home Movie News చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. మీకో స‌ర్ ఫ్రైజ్ ఇవ్వ‌బోతున్నా – ప్ర‌భాస్.

చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. మీకో స‌ర్ ఫ్రైజ్ ఇవ్వ‌బోతున్నా – ప్ర‌భాస్.

94
0

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇమేజ్ బాహుబ‌లి త‌ర్వాత ఏరేంజ్ లో ఉందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్ధాయిలో గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో చిత్రంలో న‌టిస్తున్నారు. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండ‌గానే జిల్ ఫేమ్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాని ప్రారంభించారు. ఈ రెండు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్.

ఇదిలా ఉంటే…ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు. ప్రభాస్ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ఇప్పటికే ఫ్యాన్స్ రెడీ అయిపోయారు. ఈ రోజు ప్ర‌భాస్ ఫేస్ బుక్ లో స్పందిస్తూ…అందరికీ దసరా శుభాకాంక్షలు. మీ అందరికీ ఈ నెల 23న ఓ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నా. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అని తెలియ‌చేసాడు. అయితే..ప్ర‌భాస్ త‌న పుట్టిన‌రోజు నాడు త‌న పెళ్లి వార్త చెప్ప‌నున్నాడు అని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. మ‌రి..ప్ర‌చారంలో ఉన్న‌ట్టు పెళ్లి గురించి ఎనౌన్స్ చేస్తాడో..?  లేక సాహో మూవీ టీజ‌ర్ రిలీజ్ చేస్తాడో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here