Home Actor చాలా రోజుల త‌ర్వాత స‌క్స‌స్ మీట్ లో కూర్చున్నాను – చిత్ర‌ల‌హ‌రి హీరో సాయి తేజ్..!

చాలా రోజుల త‌ర్వాత స‌క్స‌స్ మీట్ లో కూర్చున్నాను – చిత్ర‌ల‌హ‌రి హీరో సాయి తేజ్..!

143
0

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయి తేజ్, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేథా హీరో, హీరోయున్లుగా న‌టించిన చిత్రం చిత్ర‌ల‌హ‌రి. ఈ చిత్రానికి నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. ఈ నెల 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ మూవీకి అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌క్స‌స్ మీట్ లో హీరో సాయితేజ్ మాట్లాడుతూ…ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత చాలా మెసేజ్ లు  వ‌చ్చాయి. అందులో ఎక్కువ మంది వాళ్ల‌ క్యారెక్ట‌ర్ ను నేను చేసిన‌న‌ట్టు ఉంది అన్నారు. అలాగే సోషల్‌ మీడియాలో ఈ సినిమాని  ప్రమోట్‌ చేస్తున్నారు. నన్ను బోయ్‌ నెక్ట్స్‌ డోర్‌ (పక్కింటి కుర్రోడు)లా ఉన్నావని అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది.

ఇది నాకు చాలా స్పెష‌ల్ ఫిల్మ్. క‌లెక్ష‌న్స్.. మార్నింగ్ షో కంటే మ్యాట్నీకి ఇంకా బాగున్నాయి అని ప్రొడ్యూస‌ర్ చెప్పారు. ఈ రెస్పాన్స్ చూసి వెరీ వెరీ హ్యాపీ. చాలా రోజుల త‌ర్వాత స‌క్స‌స్ మీట్ లో కూర్చున్నాను. ఈ స‌క్స‌స్ నా ఒక్క‌డిదే కాదండి.. టీమ్ అంద‌రిది.  న‌న్ను ఎంత‌గానో ఎంక‌రేజ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ అంద‌రికీ థ్యాంక్స్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here