Home Actor చిత్ర‌పురి కాల‌నీలో మా ఎన్నిక‌ల ప్రచారం. ఇంత‌కీ గెలిచేది ఎవ‌రు..?

చిత్ర‌పురి కాల‌నీలో మా ఎన్నిక‌ల ప్రచారం. ఇంత‌కీ గెలిచేది ఎవ‌రు..?

97
0

ఈ నెల 10 మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు. అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్న శివాజీరాజా, న‌రేష్ పోటాపోటీగా ప్ర‌చారం చేస్తున్నారు. శివాజీరాజా, బెనర్జీ,ఉత్తేజ్,ఏడిద శ్రీరామ్,బ్రహ్మాజీ,కొండేటి సురేష్ నాగినీడు తదితరులు..చిత్రపురి కాలనీ లో ఉంటున్న నటీనటులను కలవటం జరిగింది. నటీనటులకు శివాజీరాజా గారు కొండంత సాయంగా ఉంటున్నారు. ఫోన్ చేస్తే డైరెక్ట్ గా మాట్లాడే మనిషి. మాకు శివాజీరాజా మ‌ళ్లీ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటున్నాం అని ప‌లువురు న‌టులు చెప్పారు.

 ఓటు అడగడానికి రాలేదు..ఓటు మాత్రం  వినియోగించుకొండని ..మీకు నచ్చిన వ్యక్తికే ఓటు వేయండని శివాజీరాజా అనడంతో ఒక్కసారిగా అక్క‌డున్న న‌టీన‌టులు శివాజీరాజా జిందాబాద్ అంటూ తమ హర్షం వ్యక్తం చేశారు. రోజురోజుకు మా ఎన్నిక‌ల పై ఉత్కంఠ పెరుగుతోంది. మ‌రి…ఈ ఉత్కంఠ పోరులో గెలిచేది ఎవ‌రో తెలియాలంటే ఈ నెల 10 వ‌ర‌కు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here