Home Actor చిత్ర‌ల‌హ‌రి టీజ‌ర్ కు ముహుర్తం ఖ‌రారు..!

చిత్ర‌ల‌హ‌రి టీజ‌ర్ కు ముహుర్తం ఖ‌రారు..!

129
0


మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం చిత్ర‌ల‌హ‌రి. ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో తేజు స‌ర‌స‌న క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శిన్, నివేథ‌ పేతురాజ్ న‌టిస్తున్నారు. సునీల్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందుతోన్న ఈ సినిమా టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌డానికి ముహుర్తం ఖ‌రారు చేసారు. ఈ నెల 13న అన‌గా రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేయ‌డానికి ముహుర్తం ఖ‌రారు చేసారు.

ఈ విష‌యాన్ని చిత్ర‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ తెలియ‌చేస్తూ..చిత్ర‌ల‌హ‌రి లోని పాత్ర‌లు 13వ తారీఖున 9 గంట‌ల‌కు మిమ్మ‌ల్ని క‌లుస్తారు అంటూ ఓ పోస్ట‌ర్ ను రిలీజ్ చేసింది. టైటిల్ కి త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమా క‌థ‌, క‌థ‌నం కూడా చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంటుందని…స‌రైన స‌క్స‌స్ కోసం ఎదురు చూస్తోన్న తేజుకి ఈ మూవీ ఖ‌చ్చితంగా విజ‌యాన్ని అందిస్తుంద‌ని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here