Home Actor చిత్ర‌ల‌హ‌రి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్.!

చిత్ర‌ల‌హ‌రి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్.!

107
0


సాయితేజ్, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేద పేతురాజ్ హీరో, హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం చిత్ర‌ల‌హ‌రి. ఈ చిత్రానికి నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రేమకథా చిత్రాలతో మెప్పించే దర్శకుడు కిషోర్ తిరుమల ఈసారి కూడా వైవిధ్య‌మైన క‌థాంశంతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాడ‌ని చాలా న‌మ్మ‌కంగా ఉన్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన చిత్ర‌ల‌హ‌రి పాట‌ల‌కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌స్తుంది.

ఈ మూవీని ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 6వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చిన‌ట్టు స‌మాచారం. అయితే…ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారనేది తెలియాల్సివుంది. రొమాంటిక్ ఎంటర్ టైన‌ర్ గా రూపొందిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించారు. ఇటీవ‌ల సాయ‌తేజ్ న‌టించిన సినిమాలు ప్రేక్ష‌కులు ఆక‌ట్టుకోలేక‌పోయాయి.

దీంతో ఈ సినిమా పై సాయితేజ్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. మ‌రి..అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా చిత్ర‌ల‌హ‌రి అంద‌ర్నీఆక‌ట్టుకుని సాయి తేజ్ కి విజ‌యాన్ని అందిస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here