Home Actor చిత్ర‌ల‌హ‌రి రివ్యూ..!

చిత్ర‌ల‌హ‌రి రివ్యూ..!

178
0

మెగాస్టార్ మేన‌ల్లుడుగా తెర‌కు ప‌రిచ‌య‌మైన సాయిధ‌ర‌మ్ తేజ్..పిల్లా నువ్వులేని జీవితం, రేయ్, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, సుప్రీమ్ చిత్రాల‌తో ఆక‌ట్టుకుని త‌న‌కంటూ ఓ గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు. ఆత‌ర్వాత న‌టించిన తిక్క‌, విన్న‌ర్, న‌క్ష‌త్రం, జ‌వాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ ల‌వ్ యు చిత్రాలు నిరాశ ప‌ర‌చ‌డంతో కెరీర్ లో బాగా వెన‌క‌బ‌డిపోయాడు. ఇలా ఆరు ఫ్లాప్ చిత్రాల త‌ర్వాత తేజ్ న‌టించిన చిత్రం చిత్ర‌ల‌హ‌రి. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా పై తేజ్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించిన చిత్ర‌ల‌హ‌రి ఈరోజు (ఏప్రిల్ 12) రిలీజైంది. మ‌రి…స‌రైన స‌క్స‌స్ కోసం ఎదురు చూస్తోన్న తేజ్ కి చిత్ర‌ల‌హ‌రి విజ‌యాన్ని అందించిందా..?  లేదా..? అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

– విజ‌య్ కృష్ణ (సాయి తేజ్) త‌న పేరులో విజ‌యం ఉంది కానీ..త‌న‌కు మాత్రం విజ‌యం రావ‌డం లేద‌ని ఫీల‌య్యే యువ‌కుడు. ఎంత ప్ర‌య‌త్నించినా విజ‌యం రాదు. విజ‌య్ తండ్రి (పోసాని) మాత్రం కొడుకు పై ప్రేమ‌తో ప్రొత్స‌హిస్తుంటాడు.  ఇలా విజ‌యం కోసం ప్ర‌య‌త్నిస్తున్న త‌రుణంలో ల‌హ‌రి (క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్) ప‌రిచ‌యం అవుతుంది. ఆ ప‌రిచ‌యం కాస్త‌..ప్రేమ‌గా మారుతుంది. అయితే…త‌న అల‌వాట్ల గురించి ల‌హ‌రితో అబ‌ద్ధాలు చెబుతాడు. ఓ రోజు విజ‌య్ చెప్పిన‌వి అబ‌ద్ధాలు అని ల‌హ‌రి తెలుసుకుంటుంది అంతే…విజ‌య్ ని వ‌దిలి వెళ్లిపోతుంది. ఓ వైపు జీవితంలో స‌క్స‌స్ కాక‌పోవ‌డం…త‌ను ప్రేమించిన అమ్మాయి కూడా వ‌దిలి వెళ్లిపోవ‌డంతో విజ‌య్ బాగా డ‌ల్ అయిపోతాడు. దీంతో ఆలోచ‌న‌లో ప‌డ్డ విజ‌య్ త‌న దృష్టి అంతా ఓ ప్రాజెక్ట్ పై పెడ‌తాడు. ఈ ప్ర‌య‌త్నంలో స్వేచ్ఛ (నివేథా పేతురాజ్) ప‌రిచ‌యం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ విష‌యంలో కూడా ఫెయిల్ అవుతాడు. ఆఖ‌రికి విజ‌య్ ప్రేమ‌క‌థ ఏమైంది..? త‌ను లైఫ్ లో స‌క్స‌స్ అయ్యాడా..?  లేదా..?  అనేదే మిగిలిన క‌థ‌.

ప్లస్ పాయింట్స్

సాయితేజ్ న‌ట‌న‌

సెకండాఫ్

దేవిశ్రీ సంగీతం

డైలాగ్స్

మైనస్ పాయింట్స్

ఫ‌స్టాఫ్ స్లోగా ఉండ‌డం

విశ్లేష – వ‌రుస‌గా ఆరు సినిమాలు ఫ్లాప్స్ త‌ర్వాత‌..ఈసారి విజ‌యం సాధించాల‌ని ఎంతో ప‌ట్టుద‌ల‌తో సాయితేజ్ చేసిన ప్ర‌య‌త్న‌మిది. క‌థ‌ను న‌మ్మి క‌థ‌కు ఏం కావాలో అలా న‌టించాడు. ఇంకా చెప్పాలంటే…క్యారెక్ట‌ర్ కు త‌గ్గ‌ట్టుగా ఎమోషన‌ల్ సీన్స్, డ్యాన్స‌ల‌లో అద్భుతంగా న‌టించి మెప్పించారు సాయితేజ్.  ఇక హీరోయిన్స్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేథ పేతురాజ్ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టుగా అందం, అభిన‌యం ప్ర‌ద‌ర్శించి ఆక‌ట్టుకున్నారు. విజ‌య్ కృష్ణ ఫ్రెండ్ గా సునీల్, వెన్నెల కిషోర్ త‌న‌దైన శైలిలో న‌టించి ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించారు.

 విజ‌య్ కృష్ణ తండ్రి పాత్ర‌లో పోసాని కృష్ణ ముర‌ళి…కొడుకు పై పూర్తి న‌మ్మ‌కం ఉన్న తండ్రిగా..  ఓ మిడిల్ క్లాస్ ఫాద‌ర్ గా న‌టించారు. నీ కొడుకును అంతా తిట్టుకుంటున్నారు అని పోసాని ఫ్రెండ్ చెప్పిన‌ప్పుడు…త‌న కొడుకు స‌క్స‌స్ సాధిస్తాడు..ఒక‌రితో చెప్పించుకోవాల్సిన ప‌రిస్థితిలో లేడు అంటూ చెప్పే డైలాగ్ ఆడియ‌న్స్ కి బాగా క‌నెక్ట్ అయ్యేలా ఉంది.

నేను శైల‌జ‌, ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ చిత్రాల‌తో కిషోర్ తిరుమ‌ల సెన్సిబుల్ పాయింట్స్ తో అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా సినిమాలు తీసి మెప్పించ‌గ‌ల‌ర‌ని నిరూపించారు. అయితే…ఈ సినిమాలో ఫ‌స్టాఫ్ చూస్తున్న‌ప్పుడు క‌థ ఇంకా ముందుకు సాగ‌డం లేదేంటి..? అనిపిస్తుంటుంది.  సెకండాఫ్ స్టార్ట్ అయిన త‌ర్వాత మాత్రం ఆడియ‌న్స్ క‌నెక్ట్ అయ్యేలా ఎమోష‌న‌ల్ సీన్స్ తో క‌థ‌ను చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు.

స‌న్నివేశానికి త‌గ్గ‌ట్గుగా సంభాష‌ణ‌లు రాయ‌డంతో ద‌ర్శ‌కుడిగా త‌డ‌బ‌డినా…కిషోర్ తిరుమ‌ల ర‌చ‌యిత‌గా మాత్రం స‌క్స‌స్ అయ్యాడ‌ని చెప్ప‌చ్చు.  రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ మ‌రోసారి త‌న సంగీతంతో మ్యాజిక్ చేసాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ సినిమాని మంచి క్వాలిటీతో నిర్మించారు. టోట‌ల్ గా ఈ సినిమా గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే…సాయితేజ్ గ‌త చిత్రాల‌తో పోలిస్తే…ఓ మంచి ప్ర‌య‌త్నం చిత్ర‌ల‌హ‌రి.

రేటింగ్ – 2.75/ 5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here