Home Movie Reviews చిన‌బాబు రివ్యూ..!

చిన‌బాబు రివ్యూ..!

100
0
chinababu review

కార్తీ, సాయేషా జంట‌గా న‌టించిన చిత్రం చిన‌బాబు. ఈ చిత్రానికి పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప‌ల్లెటూరు నేప‌ధ్యంతో ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని 2డి ఎంట‌ర్ టైన్మెంట్స్, ద్వార‌కా క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్ పై సూర్య‌, మిరియాల ర‌వీంద‌ర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున‌తో క‌లిసి ఊపిరి సినిమాలో న‌టించిన కార్తీ…ఇప్పుడు నాగార్జున టైటిల్ అయిన చిన‌బాబుతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం విశేషం. చిన‌బాబు ఈరోజు (జులై 13) రిలీజైంది. మ‌రి..ఫ్యామిలీ డ్రామ‌గా రూపొందిన చినబాబు ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి క‌నెక్ట్ అయ్యాడా..?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.!

క‌థ – పెనుగొండ రుద్ర‌రాజు రైతు (స‌త్య‌రాజ్). ఇత‌ని కుమారుడు కృష్ణంరాజు (కార్తీ). రుద్ర‌రాజుకు ఐదుగురు అమ్మాయిల త‌ర్వాత కృష్ణంరాజు పుట్ట‌డంతో చాలా గారాబంగా చూసుకుంటారు. కృష్ణంరాజు  రైతే దేశానికి ఆధారం అని న‌మ్మే ఆద‌ర్శ రైతు. ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కే చ‌దువుకున్న‌ప్ప‌టికీ ఆర్గానిక్స్ వ్య‌వ‌సాయం చేస్తూ నెల‌కి ల‌క్ష‌న్న‌ర‌కు పైగా సంపాదిస్తుంటాడు. అత‌నికి ఇద్ద‌రు మేన‌కోడ‌ల్లుంటారు. వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రిని ఇచ్చి పెళ్లి చేయాల‌నుకుంటారు. కానీ..కృష్ణంరాజు మాత్రం నీల‌నీర‌ద (సాయేషా)ను ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్ళి చేసుకోవాల‌నుకుంటాడు. దీంతో కుటుంబంలో గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. ఇదే టైమ్ లో నీల‌నీర‌ద బావ సురేంద్ర‌రాజు, (శ‌త్రు) ను ఓ హ‌త్య కేసులో కృష్ణంరాజు అరెస్ట్ చేయిస్తాడు. దీంతో సురేంద్ర‌రాజు… కృష్ణంరాజు పై ప‌గ తీర్చుకోవాల‌నుకుంటాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కృష్ణంరాజు ఏం చేసాడు..?  త‌న ప్రేమ క‌థ ఏమైంది..? అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

ఫ్యామిలీ స్టోరీ

కార్తీ, సాయేషా, స‌త్య‌రాజ్ న‌ట‌న‌

రైతు గురించి గొప్ప‌గా చెప్ప‌డం

మైన‌స్ పాయింట్స్

తెలుగు నేటివిటీకి దూరంగా ఉండ‌డం

కొన్ని చోట్ల ఎమోష‌న్ పండ‌క‌పోవ‌డం..

విశ్లేష‌ణ – రైతు అన‌గానే మ‌న‌కు క‌ష్టాలు క‌న్నీళ్లు గుర్తొస్తాయి కానీ..పుట్టించినోడు దేవుడైతే…పండించేవాడు దేవుడే..అంటూ రైతుని హీరోగా చూపించ‌డం బాగుంది. కార్తీ సినిమా అంటే ఎంట‌ర్ టైన్మెంట్, రొమాన్స్, మాస్ …ఇలా ప్రేక్ష‌కులు ఏం ఆశిస్తారో అవ‌న్నీ ఉండేలా ఈ క‌థ‌తో డైరెక్ట‌ర్ పాండిరాజ్ చాలా బాగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. రైతు పాత్ర అంటే ఏదో రైతు పాత్రలో చూపించాం అని కాకుండా…సినిమా అంతా రైతు పాత్ర‌లో ఉంటూ ఈ వృత్తిని గొప్ప‌గా చూపించ‌డం బాగుంది. కార్తీ గోదావ‌రి యాస‌లో మాట్లాడ‌డం అభినంద‌నీయం.  ఇక హీరోయిన్ సాయేషా ప‌ల్లెటూరి అమ్మాయి పాత్ర‌లో చాలా చ‌క్క‌గా న‌టించింది. స‌త్య‌రాజ్ పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించారు.  అయితే…కొన్ని చోట్ల తెలుగు బోర్డులు కనిపిస్తే..కొన్ని త‌మిళ బోర్డులు కనిపిస్తుంటాయి. అలా కాకుండా అన్ని చోట్లా తెలుగు బోర్డులే పెట్టుంటే బాగుండేది.  సినిమాలో త‌మిళ నేటివిటీ ఎక్కువుగా ఉంది. దీనికి తోడు తెలుగు వారికి తెలిసిన ఆర్టిస్టులు లేరు. అందుచేత తెలుగు వారు అంత‌గా క‌నెక్ట్ కాక‌పోవ‌చ్చు. సినిమా ప్రారంభంలో ఎడ్ల పందెల‌ప్పుడు సూర్య క‌నిపించ‌డం బాగుంది. ఇమాన్ సంగీతం అందించిన పాట‌లు ఫ‌ర‌వాలేద‌నిపించినా..ఎమోష‌న‌ల్ సీన్స్ లో మ్యూజిక్ మ‌రింత బ‌లాన్నిచ్చింది. టోట‌ల్ గా చిన‌బాబు గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే..ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి క‌నెక్ట్ అయ్యే చిన‌బాబు.!

రేటింగ్ – 3/5

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here