Home Telugu చిన‌మామ నుంచి పొందిన బెస్ట్ కాంప్ల‌మెంట్ అదే – సుశాంత్..!

చిన‌మామ నుంచి పొందిన బెస్ట్ కాంప్ల‌మెంట్ అదే – సుశాంత్..!

121
0
Chi la Sow release date

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన తాజా చిత్రం చి ల సౌ. ఈ చిత్రం ద్వారా హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సిరుణి సినీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ఈ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. సుశాంత్, రుహాని శ‌ర్మ జంట‌గా న‌టించిన చి ల సౌ ఆగ‌ష్టు 3న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా హీరో సుశాంత్ చి ల సౌ చిత్ర విశేషాల‌ను మీడియాతో పంచుకున్నారు.

సుశాంత్ మాట్లాడుతూ…కాళిదాసు, క‌రెంట్, అడ్డా, ఆటాడుకుందాం రా చిత్రాలు చేసిన త‌ర్వాత ఈసారి కొత్త‌గా..  డిఫ‌రెంట్ మూవీ చేయాల‌ని అనుకున్న‌ప్పుడు, రాహుల్  డైరెక్ష‌న్ త‌న డ్రీమ్ అని..ఈ క‌థ చెప్పాడు. ఈ క‌థ విన్న వెంట‌నే న‌చ్చ‌డంతో మ‌రో ఆలోచ‌న లేకుండా ఓకే చెప్పాను. ఆత‌ర్వాత చైత‌న్యకి ఈ సినిమాని చూపిస్తే..చాలా బాగుంద‌ని చినమామ నాగార్జున‌కి చెప్ప‌డం..ఆయ‌న‌కి విప‌రీతంగా న‌చ్చ‌డంతో అన్న‌పూర్ణ స్టూడియోస్ ద్వారా రిలీజ్ చేస్తున్నామ‌ని చెప్పారు.

ఇక ఈ సినిమా చూసి నాగ్ ఏమ‌న్నార‌ని సుశాంత్ ని అడిగితే…ఈ సినిమా చూసిన త‌ర్వాత అమ్మ‌ని పిలిచి మంచి క‌థ‌ను సెలెక్ట్ చేసుకున్నాడు.  పాత్ర‌కు త‌గ్గ‌ట్టు చాలా బాగా న‌టించాడ‌ని నా యాక్టింగ్ గురించి చాలా సేపు మాట్లాడార‌ట‌. ఇదే చిన‌మామ నుంచి నేను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అంటున్నాడు సుశాంత్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here