Home Actor చిరు – కొర‌టాల మూవీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

చిరు – కొర‌టాల మూవీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

74
0

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా చిత్రంలో న‌టిస్తున్నారు. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మకంగా  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ద‌స‌రాకి సైరాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే…ఈ మూవీ త‌ర్వాత చిరు బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొరటాల శివ‌తో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే కొర‌టాల ఈ మూవీ స్ర్కిప్ట్ వ‌ర్క్ కంప్లీట్ చేసారు. ఇందులో సునీల్, అన‌సూయ ముఖ్య‌పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో న‌టించే క‌థానాయిక విష‌యానికి వ‌స్తే..శృతిహాస‌న్, త‌మ‌న్నా పేర్లు వినిపిస్తున్నాయి కానీ..ఇంకా ఎవ‌ర్నీ క‌న్ ఫ‌ర్మ్ చేయ‌లేద‌ని స‌మాచారం. సందేశంతో పాటు వినోదంతో ఉండే ఈ విభిన్న క‌థా చిత్రాన్ని ఆగ‌ష్టు నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here