Home Actor చిరు, కొర‌టాల మూవీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

చిరు, కొర‌టాల మూవీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

95
0


మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రంలో న‌టిస్తున్నారు. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. మ‌రో రెండు నెల‌ల్లో ఈ మూవీ షూటింగ్ పూర్త‌వుతుంది. అమితాబ్ పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. అయితే..ఈ సంవ‌త్స‌రం ద్వితీయార్ధంలో సైరా సినిమాని రిలీజ్ చేయ‌నున్నట్టు నిర్మాత రామ్ చ‌ర‌ణ్ ప్ర‌క‌టించారు.

ఈ సినిమా త‌ర్వాత చిరంజీవి..బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్నారు. జులై నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. షూటింగ్ స్టార్ట్ అయితే…గ్యాప్ లేకుండా కంప్లీట్ చేసేలా ప‌క్కా ప్లాన్ రెడీ చేస్తున్నార‌ని తెలిసింది. డిసెంబ‌ర్ కి షూటింగ్ పూర్తి చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నార‌ని..శృతిహాస‌న్ ఎంపిక చేసార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌లు..నిజ‌మా కాదా అనేది తెలియాల్సివుంది..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here