Home Telugu చిరు చిన్న‌ల్లుడు డ‌బ్బింగ్ స్టార్ట్ చేసేసాడుగా..!

చిరు చిన్న‌ల్లుడు డ‌బ్బింగ్ స్టార్ట్ చేసేసాడుగా..!

107
0

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ ని చూడ‌గానే…చూడ‌డానికి హీరోలా క‌నిపిస్తున్నాడు. హీరోగా ఎంట్రీ ఇస్తాడేమో అంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఆ ప్ర‌చారానికి త‌గ్గ‌ట్టే…క‌ళ్యాణ్ హీరో అవ్వాల‌నే త‌న కోరిక‌ను చిరుతో చెప్ప‌డం…చిరు ఓకే అన‌డం జ‌రిగింది. దీంతో క‌ళ్యాణ్ హీరోగా సినిమా తీసేందుకు వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్ అధినేత సాయి కొర్ర‌పాటి ముందుకు వ‌చ్చారు. రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

ఓ వైపు షూటింగ్ జ‌రుగుతుండ‌గానే..మ‌రో వైపు డ‌బ్బింగ్ స్టార్ట్ చేసేసాడు హీరో క‌ళ్యాణ్. ఈ సినిమాలో క‌ళ్యాణ్ స‌ర‌స‌న మాళివిక నాయ‌ర్ న‌టిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాకి సంగీతం అందించిన హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా రూపొందుతోంది. త్వ‌ర‌లోనే భారీ స్ధాయిలో ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చిరు చిన్న‌ల్లుడు కాబ‌ట్టి ఈ సినిమాకి ఓపెనింగ్స్  బాగానే వ‌చ్చే అవ‌కాశం ఉంది. మ‌రి..చిరు చిన్న‌ల్లుడు ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here